మాటల మాంత్రికుడు నరేంద్ర మోడీ.. లేబర్ కోడ్లను రద్దు చేయాలి
1 min read
సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.ఎస్. రాధాకృష్ణ
బ్రిటిష్ ప్రభుత్వాన్ని కలిగిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం. పార్టీ మండల కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి.
కార్మికులకు అండగా సిఐటియు జెండా. సమస్యలకు వెరవం ఉద్యమాలకు సిద్ధం. సిఐటి యు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర.
సిఐటియు కార్యాలయం నుండి భారీ సంఖ్యలో కార్మికుల ర్యాలీ
సిఐటియు కార్మికులతో పట్టణంలో హోరెత్తిన కార్మిక దినోత్సవం మే డే
బహిరంగ సభ జన సంద్రోహం మధ్య మేడే ఉత్సవాలు
న్యూస్ నేడు, పత్తికొండ : మే డే ప్రపంచ 140వ కార్మిక దినోత్సవం ఉత్సవాలు సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. ముందుగా సివిల్ సప్లై గోడౌన్ హమాలీ వర్కర్స్ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్ దగ్గర జండా ఆవిష్కరించారు. అనంతరం పట్టణంలోని ముఖ్యంగా మారెళ్ళ ఆర్ఎస్ పెండేకల్ ఆటో కార్మికుల అడ్డాల దగ్గర జండా ఆవిష్కరించి చందోలి తుగ్గలి ఆటో కార్మికుల అడ్డాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేశారు. అనంతరం కోర్టు సమీపంలో ఉన్న స్తూపం దగ్గర జండా ఆవిష్కరణ చేసిన అనంతరం అంబేద్కర్ సర్కిల్ దగ్గర ఉన్న సిఐటియు కార్యాలయం దగ్గర సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ, చేతులమీదుగా జండా ఆవిష్కరణ చేపట్టారు. అనంతరం అక్కడి నుండి నాలుగు స్తంభాల కూడలి మీదుగా కుమ్మరి వీధిలో ఉన్న సిపిఎం పార్టీ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణానికి భారీ సంఖ్యలో కార్మికులు మేడే వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మిక రాజ్యం రావాలి అంటూ నినాదాలు నినాదాలు చేస్తూ అక్కడికి చేరుకున్నారు. బహిరంగ సభ ప్రాంగణంలో మేడే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పత్తికొండ మండల సిఐటియు కార్యదర్శి ఎం. రవిచంద్ర, అధ్యక్షతన వహించారు. ముఖ్య అతిథులుగా సిఐటియ.

