జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం వేడుకలు ఘనంగా
1 min read

గ్రామ స్వరాజ్యం సాధనలో పంచాయతీల పాత్ర కీలకం – వైకుంఠం జ్యోతి
ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గం, దేవనకొండ: జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా దేవనకొండ పంచాయతీ కార్యాలయం ముందు ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఆలూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ, గ్రామ స్వరాజ్యమే నిజమైన అభివృద్ధికి పునాది అని తెలిపారు. పంచాయతీ రాజ్ వ్యవస్థ గ్రామాల అభివృద్ధికి కీలకంగా పనిచేస్తోందని, ప్రజల అవసరాలను తీర్చే విధంగా పంచాయతీలు మరింత బలపడాలని అన్నారు. గ్రామస్థాయిలో పారదర్శకత, సమర్థవంతమైన పాలన ఉండాలని ఆమె ఆకాంక్షించారు.అలాగే గ్రామాల అభివృద్ధి కోసం ప్రజలు, నాయకులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. పంచాయతీ వ్యవస్థను మరింత బలోపేతం చేసి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


