దెబ్బకు…విలవిల్లాడుతున్న జనం
1 min read

జిల్లాలో 42.8 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
11 గంటలకే రోడ్లు నిర్మానుష్యం
మరింత పెరిగే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ
ఆందోళన చెందుతున్న ప్రజలు..
నందికొట్కూరు న్యూస్ నేడు:ఎర్ర సూరీడు దెబ్బకు జనం విలవిల్లాడుతున్నారు.ఇదేమి ఎండలు రా..బాబోయ్ అంటూ ఇంటిలో నుంచి బయటికి రావాలంటేనే గుండె దడ పుట్టిస్తోంది.ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కూరులో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవడంతో ఉష్ణోగ్రతల దెబ్బకు జనం అల్లాడిపోతున్నారు.
ఉష్ణోగ్రతలు పెరుగుతాయంటున్న వాతావరణ శాఖ
ఎండ వేడిమి అధికంగా ఉండటం బయటికి వస్తే ఎక్కడ ఆరోగ్యం దెబ్బతింటుందోనని ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. ఉ 10 గంటలు దాటితేనే ప్రజలు బయటికి రావాలంటేనే జనం జంకుతున్నారు.ప్రధానంగా రోడ్లపై ప్రజలు లేకపోవడంతో ప్రధాన రోడ్లు ఉ 11:30 నుండి సాయంత్రం వరకు స్థానిక నందికొట్కూరు ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులు లేకపోవడంతో బస్టాండ్ వెలవెలబోతోంది.ఎల్ నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో ఇంకా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది.దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
అవసరం ఉంటే తప్పా బయటకి రావద్దు
ఎన్నడూ లేనంతగా ఇప్పుడు అధికంగా ఉష్ణోగ్రతలు రావడంతో రోడ్లపైకి పిల్లలు మహిళలు ప్రయాణికులు రాలేకపోతున్నారు.వచ్చినా అది కూడా ఎండవేడిమి తలపై పడకుండా గొడుగు,టవల్,క్లాత్ తలపై పెట్టుకుని తమ పనులు ముగించుకునేందుకు బయటికి వస్తున్నారు.ఏది ఏమైనా సరే అవసరం ఉంటే తప్పా బయటకి రావద్దని డాక్టర్లు ప్రజలను కోరుతున్నారు.ఆరోగ్యం దెబ్బ తిన్నాక చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు ప్రజలకు సూచిస్తున్నారు.


