నాటుసారా బెల్లపు ఊట ధ్వంసం
1 min read

ప్రొహిబిషన్ ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు..
నందికొట్కూరు, న్యూస్ నేడు: నాటు సారాయి మరియు బెల్లపు పూటను ధ్వంసం చేసినట్లు నందికొట్కూరు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సీఐ ఎస్ రామాంజనేయులు తెలిపారు.నంద్యాల జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి ఎస్.రవికుమార్ సూచనల మేరకు శుక్రవారం దాడులు చేశారు.ఎక్సైజ్ సీఐ,ఎస్ఐ జఫురుల్లా,భాష్యం శ్రీనివాసులు,కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి మరియు వారి సిబ్బందితో కలిసి నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో ఉండే దాసరి వంశీ (23)అనే వ్యక్తి వద్ద ఎనిమిది లీటర్ల నాటుసారాయి స్వాధీనం చేసుకొని కసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ తెలిపారు.అదేవిధంగాకోళ్లబావాపురం గ్రామ సమీప అటవీ ప్రాంతంలో 30 ప్లాస్టిక్ బిందెలల్లో 450 లీటర్ల నాటుసారా తయారీకి సిద్ధం చేసిన బెల్లం పూటను ధ్వంసం చేయడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో సిబ్బంది. శేఖర్ నాయకుడు,శివన్న, సుధీర్ కుమార్,మధుసూదన్ ప్రసాద్,సంధ్యారాణి, రాజశేఖర్, రామాంజనేయులు పాల్గొన్నారు.

