ప్రభుత్వ హామీలు వెంటనే అమలు చేసి 12వ పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చెయ్యాలి
1 min read

ఎస్.టి.యూ రాష్ట్ర అధ్యక్షులు, ఎఫ్ఏపిటిఓ చైర్మన్ లంకలపల్లి సాయి శ్రీనివాస్
దశలవారీగా చేసే పోరాటాలకు ఉపాధ్యాయులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు : 12వ పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి మానిఫెస్టో లో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చెయ్యాలని ఎస్.టి.యూ రాష్ట్ర అధ్యక్షులు, ఎఫ్ ఏ పి టి ఓ చైర్మన్ లంకలపల్లి సాయి శ్రీనివాస్ అన్నారు. గురువారం పెదవేగి మండలంలో వివిధ పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన 4 డి.ఏ లను వెంటనే ప్రకటించి, సి.పి.ఎస్ రద్దు చేసి, 12 వ పిఆర్సీ కమిటీ నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హామీల సాధన కోసం ఎస్.టి.యూ ఆధ్వర్యం లో నిర్వహించే దశల వారీ పోరాటంలో ఉపాధ్యాయులందరు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో ఎస్.టి.యూ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.ఆర్ పవన్ కుమార్, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శులు బి. మహేష్, ఎం.డి షఫీయుద్దిన్, పెదవేగి మండల అధ్యక్షులు పి.నాగార్జున, ప్రధాన కార్యదర్శి టి.ప్రవీణ్ కుమార్, నెరుసు శ్రీనివాస్, వి.అమృత్, టి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

