NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్యాపిలిలో టీడీపీకి కొత్త జోష్‌.. వైసీపీ నుంచి 50 కుటుంబాల చేరిక!

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు : ప్యాపిలి మండలంలో తెలుగుదేశం పార్టీకి మరోసారి రాజకీయ ఉత్సాహం లభించింది. చిన్నపొద్దిల గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 50 కుటుంబాలు వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీలో చేరాయి. డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ వైపు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు.ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా టీడీపీ పనిచేస్తోందని, రానున్న రోజుల్లో మరింత మంది పార్టీలో చేరే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. నూతనంగా చేరిన నాయకులు, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు. ఈకార్యక్రమంలో సీనియర్ తేదేపా నాయకులు లక్కసాగరం లక్ష్మి రెడ్డి, ఎద్దుల దొడ్డి ప్రభాకర్ రెడ్డి, తెదేపా నాయకులు పెద్ద పూజర్ల ప్రసాద్ రెడ్డి, లక్ష్మి నారాయణ యాదవ్,ఆర్ఇ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *