NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉపాధి కూలీల హక్కులను కాలరాస్తున్న కొత్త చట్టం

1 min read

మాజీ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజు

కర్నూలు, న్యూస్​ నేడు:   ఉపాధి హామీ కూలీల హక్కులను కాలరాస్తున్న కొత్త చట్టం అని మాజీ ఐఏఎస్ అధికారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానితులు, ఏఐసీసీ జార్ఖండ్ ఇన్చార్జి శ్రీ కొప్పుల రాజు గారు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. శనివారం కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కే రాజుగారు మాట్లాడుతూ మహాత్మాగాంధీ ఉపాధి జాతీయ ఉపాధి హామీ పథకానికి ఆంధ్రప్రదేశ్ కు సంబంధం ఉందని ఈరోజు దేశంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పేదల చేతిలో నుంచి లాక్కొని ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి దానిమీద దేశంలో అన్ని జిల్లాల్లో ఇటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్ కి చాలా సంబంధం ఉన్నది అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగసోనియా గాంధీ అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డిఅనంతపూర్ జిల్లా బండ్లపల్లి అను గ్రామంలో ఈ పథకం ప్రారంభించడం జరిగిందని ఆ కాలంలో ఆ సమయంలో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసే కార్యక్రమాన్ని రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న నాకు ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో మొత్తం దేశం మొత్తంలో ఒక ఆదర్శవంతంగా అమలు చేసే అవకాశం అమలు చేయటానికి కావలసినటువంటి సపోర్ట్ అనేది అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి నుంచి వచ్చింది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బి క్రాంతి నాయుడు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష, మాజీ మంత్రి మూలింటి మారెప్ప, యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి నాగ మధు యాదవ్, మాజీ డిసిసి అధ్యక్షులు కే బాబురావు కోఆర్డినేటర్లు ఎం కాశీం వలి, అనంతరత్నం మాదిగ, ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షులు బి బతుకన్న, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎన్సి బజారన్న, ఎస్టి సెల్ జిల్లా అధ్యక్షులు వై మారుతీ రావు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బి మహేంద్ర నాయుడు, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు షేక్ ఖాజా హుస్సేన్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఏ సూర్య ప్రకాష్ రెడ్డి, ఓబీసీ సెల్ చైర్మన్ డివి సాంబశివుడు, ఐఎన్టీయూసీ సిటీ అధ్యక్షులు రేపల్లె ప్రతాప్, కాంగ్రెస్ నాయకులు దేవిశెట్టి ప్రకాష్, శ్రీ అశోక రత్నం, దామోదరం రాధాకృష్ణ, దిలీప్ దొక, షేక్ రియాజుద్దీన్, జాన్ సదానందం, మహమ్మద్ నూర్, శ్రీ నిత్ రాయల్, ఎన్ సుంకన్న, శేషయ్య రామాంజనేయులు, తాయన్న రంగస్వామి, హుస్సేన్ మొదలగువారు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *