ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి చేస్తాం-మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్
1 min read

ఆర్యవైశ్యుల సమస్యలను పరిష్కరిస్తూ వారి అభ్యున్నతికి కృషి చేస్తామని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు.
కర్నూలు, న్యూస్ నేడు: స్థానిక రాంబోట్ల స్వామి గుడి దగ్గర నుంచి చిన్న అమ్మవారి శాల వరకు ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో తలపెట్టిన కలశ యాత్రను ఈరోజు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా టిజి వెంకటేష్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలలో ఆర్యవైశ్యులకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు తాము ముందు ఉంటామని తెలిపారు. రాష్ట్ర మంత్రిగా భరత్ ఎంతగానో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చేందుకు ఎంతగానో కష్టపడుతున్నారని తెలిపారు. పరిశ్రమలు ఏర్పాటుతో చదువుకున్న వైశ్య యువతకు ఉపాధి అవకాశాలు ఎంతగానో ఉంటాయని టీజీ తెలిపారు. ఆర్యవైశ్య సోదరీమణులు ఎంతో కష్టమైనప్పటికీ నియమనిష్ఠలతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయమన్నారు. ఇటువంటి కార్యక్రమాలతో భక్తి భావం పెంపొంది, క్రమశిక్షణ అలబడుతుందని టీజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో లలితా పీఠం సుబ్బిస్వామి, సాయిబాబా, నాగ వీరాంజనేయులు, సుబ్రహ్మణ్యం, రవి తదితరులు పాల్గొన్నారు.


