NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆసుపత్రి సూపరింటెండెంట్ పలు విభాగాల్లో ఆకస్మిక తనిఖీలు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె. వెంకటేశ్వర్లు బుధవారం ఆసుపత్రిలోని పలు విభాగాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రోగులకు అందుతున్న సేవలు, ఆసుపత్రి నిర్వహణను స్వయంగా పరిశీలించిన ఆయన, సిబ్బందికి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.ఆసుపత్రిలో నిర్మాణంలో ఉన్న బాత్రూమ్ పనుల స్థితిగతులను పరిశీలించారు. పారిశుధ్యం విషయంలో నిర్లక్ష్యం వహించరాదని శానిటేషన్ సిబ్బందిని హెచ్చరించారు.వార్డుల్లో రోగులకు అందుతున్న చికిత్సపై ఆరా తీశారు. రోగి యొక్క ప్రతి వివరము ‘కేసు షీట్’లో స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు.అవసరైన అన్ని రకాల మందులు, పరీక్షలు ఆసుపత్రిలోనే అందుబాటులో ఉన్నాయని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాయకూడదని అలా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని వైద్యులను, సిబ్బందినీ హెచ్చరించారు.చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయిన రోగులకు ప్రభుత్వం నుండి ఫీడ్‌బ్యాక్ కాల్ వస్తుందని, ఆ కాల్‌కు ఖచ్చితంగా స్పందించి ఆసుపత్రి సేవలపై తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని రోగులకు, వారి సహాయకులకు వివరించాలని నర్సింగ్ సిబ్బందిని ఆదేశించారు.విధుల్లో అలసత్వం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ తో పాటు ఆర్​ఎంఓ  లు, అడ్మినిస్ట్రేషన్ అధికారులు, నర్సింగ్ సూపరింటెండెండెంట్లు మరియు ఇతర ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

About Author