NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ శంకరాస్ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ డే

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:   శ్రీ శంకరాస్ డిగ్రీ కళాశాల నందు ఎన్ఎస్ఎస్ డేను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపల్ అండ్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మద్దిలేటి మాట్లాడుతూ విద్యార్థులు సేవా గుణాన్ని అలవర్చుకొని సమాజానికి మార్గదర్శకులు కావాలని తెలియజేయడం జరిగింది. ఎలాంటి ప్రతిఫలం లేకుండా సేవా చేయడమనేది విద్యార్థి యొక్క గుణంగా అలవర్చుకోవాలని మనుషులకి, సమాజానికి సేవ చేసి ఇతరులకి మార్గదర్శకంగా నిలవాలని తెలియజేయడం జరిగింది విద్యార్థుల సేవా గుణంతోపాటు తమ యొక్క లక్ష్యాలను మర్చిపోకుండా ఉత్తమ విద్యార్థులుగా నిలిచి తమ తల్లిదండ్రుల ఆశయాలను అధ్యాపకుల యొక్క ఆశయాలను నెరవేర్చాలని తెలియజేయడం జరిగింది. ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు ఎన్ఎస్ఎస్ గురించి వ్యాసరసేన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ మద్దిలేటి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్   ముఖిత్ తెలుగు అధ్యాపకులు మద్దయ్య మరియు ఇతర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

About Author