NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నగరపాలకలో ‘అంగీకార్’ అవగాహన సదస్సు

1 min read

పిఏంఏవై-యూ 2.0 అంగీకార్‌లో భాగం ఉచిత వైద్య శిబిరం

అర్హులైన ఇళ్ళకు దరఖాస్తు చేసుకోవాలి

నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ సూచన

నగరపాలక సంస్థ;

కర్నూలు, న్యూస్​ నేడు: మంగళవారం  ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – అర్బన్ 2.0 లో భాగంగా అంగీకార్ 2025 అవగాహన కార్యక్రమం కింద నగరపాలక కార్యాలయ ఆవరణలో మంగళవారం మెడికవర్ ఆసుపత్రుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని కమిషనర్ ప్రారంభించారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే మరింత మెరుగ్గా పనిచేయగలుగుతారని, ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరని తెలిపారు. దీని దృష్ట్యా ప్రభుత్వం ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ ఉద్యోగుల సంక్షేమంపై శ్రద్ధ చూపుతోందన్నారు. అంగీకార్ కార్యక్రమం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – అర్బన్ 2.0లో ఒక ముఖ్య భాగమని, పేద, బలహీన వర్గాలకు గృహాల కల్పనతో పాటు సమగ్ర సంక్షేమం అందించడమే దీని ప్రధాన లక్ష్యమని వివరించారు. ఇందులో భాగంగా పీఎంఏవై–యూ 2.0 దరఖాస్తుల వేగవంతమైన ధృవీకరణ, ప్రత్యేక వర్గాల లబ్ధిదారుల చేర్పు, గృహ రుణాలపై వడ్డీ సబ్సిడీ, పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన లాభాలు, గృహ ప్రవేశ కార్యక్రమాలు, తక్కువ ఆదాయ వర్గాల కోసం లోన్ మేళాలు, అవగాహన కార్యక్రమాలు వంటి అనేక చర్యలు చేపడుతున్నారని తెలిపారు. నగరంలో ఇళ్ళు లేనివారు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ కోరారు. మధ్యతరగతి వారు ఇళ్ళ కోసం సబ్సిడి రుణాలు పొందాలని కోరారు.కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, మేనేజర్ చిన్నరాముడు, సోషల్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్ డా.పెంచలయ్య, ఎం‌ఐయస్ మధుసూదన్ రెడ్డి, మెడికవర్ ఆసుపత్రి వైద్యులు మురళీ మోహన్, మంజూనాథ్, మహేశ్వర్ రెడ్డి, బి.వి. కొండారెడ్డి, శేషునాయుడు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author