NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అరికేరా గ్రామంలో ఘనంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

1 min read

లబ్ధిదారుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం – వైకుంఠం జ్యోతి

ఆలూరు న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు  ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమం కింద సోమవారం ఆలూరు మండలం అరికేరా గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి  పాల్గొని అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మరియు ఇతర లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె లబ్ధిదారులతో ఆప్యాయంగా ముచ్చటించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  సంక్షేమ పాలనకు పెద్దపీట వేస్తూ సమాజంలోని ప్రతి బలహీన వర్గానికి అండగా నిలుస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు మరియు ఇతర అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కల్పించడం జరుగుతోందని పేర్కొన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకుంటోందని, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి అర్హ కుటుంబానికి ప్రభుత్వ సేవలు చేరేలా అధికారులు, సచివాలయ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని చెప్పారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, సచివాలయ సిబ్బంది మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పింఛన్లు అందుకున్న లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  మరియు వైకుంఠం జ్యోతి ను కృతజ్ఞతలు తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *