NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీమద్ది ఆంజనేయ స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

1 min read

స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన,పూజలు

వివిధ సేవల, విరాళాల ద్వారా రూ:1,67,297/-లు సమకూరినది

నిత్య అన్నదాన సత్రమునందు ప్రసాద వితరణ

కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి.చందన

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  : స్వయంభూః  శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయం వద్ద ఈరోజు తెల్లవారుఝామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాతసేవ,నిత్యార్చన పూజలు నిర్వహించారు  అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు.  స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు బారులుదీరి స్వామివారిని  దర్శించుకున్నారు. ఆలయము చుట్టూ 108 ప్రదక్షణలు చేసి, మొక్కులు  చెల్లించుకున్నారు. శ్రీ స్వామివారి ఆలయం హనుమన్నామ స్మరణతో మార్మోగింది.   ఈరోజు ఆలయము వద్ద గుడిపాడు   గ్రామానికి చెందిన రామతులసి భజన సమాజం  వారు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. మంగళవారం మద్యాహ్నం వరకు దేవస్థానమునకు వివిధ సేవల, విరాళాల  ద్వారా    రూ 1,67,297/-లు  సమకూరినది.  ఆలయానికి వచ్చిన భక్తులకు  స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ  చేశారు.ఏర్పాట్లను కార్యనిర్వాహణాధికారిణి ఆర్.వి.చందన పర్యవేక్షించారు.

About Author