NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నలకదొడ్డిలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర

1 min read

శ్రమదానంలో పాల్గొన్న టిడిపి గ్రామ అధ్యక్షుడు బత్తిన రాజశేఖర్ 

న్యూస్ నేడు, పత్తికొండ : గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం… పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం…అనే నినాదంతో పత్తికొండ మండల పరిధిలోని నలకదొడ్డి గ్రామంలో టిడిపి గ్రామ అధ్యక్షుడు బత్తిన రాజశేఖర్ ఆధ్వర్యంలో మంగళవారం గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి గ్రామంలో అపరిశుభ్రంగా ఉన్న చోట గ్రామపంచాయతీ సిబ్బంది.టీడీపీ కార్యకర్తలతో కలిసి శ్రమదానం చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర-స్వచ్ఛా ఆంధ్ర కార్యక్రమాన్ని పిలుపును ఇవ్వడంతో మన గ్రామాని మనమే శుభ్రంగా ఉంచుకోవాలని నినాదంతో మండల పరిధిలోని గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కెఈ.శ్యాంబాబు టిడిపి తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తిన లోకనాథ్ ఆదేశాల మేరకు గ్రామంలో రోజుకొక కార్యక్రమాన్ని చేస్తున్నామని అందులో బాగానే వారి సహకారాలు మాకు నిరంతరం ఉంది అన్నారు.కాబట్టి మేము ముందుండి మా గ్రామాన్ని మేమే అభివృద్ధి బాటలో నడిపించాలని సంకల్పంతో అనేకమైన కార్యక్రమాలు చేపట్టమని అన్నారు.గత నాలుగు రోజుల క్రితం దేవనబండ నుండి నలక దొడ్డి వరకు రోడ్డు ఇరువైపులా వున్న ముళ్ళకంపను ఉపాధిహామీకు కూలీలతో కలిసి తొలగించి వాహనాలపై ప్రయాణం చేసే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇరువైపులా శ్రమదానంతో శుభ్రం చేశామని అన్నారు.ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మరెన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ గ్రామస్తులురఘుశేఖర్,దశరథ్. శీను,రామలింగప్ప,సురేంద్ర, నరసప్ప,నాగరాజు,అంజి,లాలప్ప,పులి శేఖర్,తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *