అందిన అర్జీలు పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి
1 min read
ప్రతి అర్జీని క్షుణ్ణంగా అధ్యయనం చేసి నిర్ణీత సమయంలోగా పరిష్కారం చూపాలి
పిజిఆర్ఎస్, రెవిన్యూ క్లినిక్ లలో వచ్చిన అర్జీలు 241
జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి
ఏలూరుజిల్లాప్రతి నిధి,న్యూస్ నేడు: జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యలు పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లాస్థాయీ అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె.అభిషేక్ గౌడ,అసిస్టెంటు కలెక్టరు సి.హెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి, ఇంచార్జి జిల్లా రెవెన్యూ అధికారి యల్.దేవకీదేవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టరు కె.భాస్కర్, ఎస్సీ కార్పొరేషన్ ఇడి యం.ముక్కంటి, జిల్లా సర్వే సహాయ సంచాలకులు అన్సారీలు ప్రజలు నుండి అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రజలు నుండి అందిన ప్రతి వినతిని సంబంధిత శాఖలు అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా సత్వర పరిష్కారం చూపాలని అన్నారు. అర్జీదారులు కార్యాలయాలు చుట్టూ తిరగకుండా, వారికి సంతృప్తి కలిగే విధంగా నాణ్యమైన పరిష్కారం చూపాలని పేర్కొన్నారు. ఏలూరు మండలం మాదేపల్లి గ్రామనివాసి రెడ్డి రమ్యశ్రీ ఇంటి నిర్మాణంకు బ్యాంకులో రుణం మంజూరు చెయ్యాలని కోరారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖలు జిల్లా అధికారులు, జిల్లా కలెక్టరేటు ఏవో యన్.వి.నాంచారయ్య,జిల్లా కలెక్టరేటు సూపర్డెంట్లు, తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.

