NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యం…

1 min read

సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించిన కూటమి నాయకులు….

హొళగుంద , న్యూస్ నేడు: ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి సీఎం చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ నాయకులు అబ్దుల్ సుభాన్, జాకీర్,ముల్లా మోయిన్, ఉస్మాన్,మల్లి,వలి  అన్నారు. బుధవారం హోళగుంద మండల కేంద్రంలోని 35 బూత్ నందు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ కూటమిపాలనలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధి గురించి వివరించారు. ప్రజలకు కరపత్రాలను అందించారు. ఈ సందర్భంగా నాయకులు ప్రజలతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా పెన్షన్ల పెంపు, దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుతున్న వారందరికీ ఒక్కొక్కరికి 13 వేల రూపాయల చొప్పున వారి తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మాట తప్పని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నిలుస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ ప్రతినెల పెన్షన్లను ఇంటి వద్దనే అందిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా పెళ్లికి వందనం పథకం అమలు చేయడంతో విద్యార్థుల విద్యాభివృద్ధికి ఎంతగానో తోడ్పాటు అందిస్తుందని మహిళలు సంతోషం వ్యక్తం చేశారు , ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నాసిర్,గిరి అబ్దుల్లా, ఖాజా, మహమ్మద్, హఫీస్, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

About Author