విజయవంతంగా ముగిసిన ఓపెన్ టు ఆల్ వాలీబాల్ టోర్నమెంట్
1 min read
పత్తికొండ, న్యూస్ నేడు: శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి తిరుణాల సందర్భంగా పత్తికొండ లో నిర్వహించిన ఓపెన్ టు ఆల్ వాలీబాల్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. ఈ టోర్నమెంట్‌ను స్థానిక ఎమ్మెల్యే కె.ఈ. శ్యాం కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.ఈ వాలీబాల్ టోర్నమెంట్ ఈ నెల 7వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు పత్తికొండలోని సొసైటీ బ్యాంక్ ప్లే గ్రౌండ్ నందు నిర్వహించారు. వాలీబాల్ టోర్నమెంట్‌లో వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుండి మొత్తం 40 జట్లు పాల్గొని తమ ప్రతిభను ఉత్కంఠ భరితంగా ప్రదర్శించాయి. తోటా పోటీగా జరిగిన ఈ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే శ్యాం కుమార్ ప్రారంభించగా, గత మూడు రోజులుగా ఎంతో ఉత్కంఠ భరితంగా టోర్నమెంట్ 9వ తారీఖున ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. టోర్నమెంటులో గెలుపొందిన క్రీడాకారులకు ఎమ్మెల్యే తెలిపారు. సాంబశివ రెడ్డి, ప్రమోద్ కుమార్ రెడ్డి, బత్తిన లోకనాథ్ ఎమ్మెల్యే పి.ఏ.హరినాథ్,కోడుమూరు సీ.ఐ తబరేజ్, ముత్తుకూరు గోవిందు చెక్క గోపాల్, చింతకాయల శ్రీకాంత్,పవన్,అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ జిల్లా కార్యదర్శి చందు నాయక్, పి.డీలు పాండు, విష్ణువర్ధన్ రెడ్డి,మధు,వేణుగోపాల్ హాజరయ్యారు.ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి క్రీడా పోటీలు మరింతగా నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పారు.ఈ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన ఆర్గనైజర్లు శీను, అంబోజి రావు, వీరేష్ ,మహమ్మద్, వెంకటేశ్వర్లు ను అతిథులు అభినందించారు. పోటీలను స్టేట్ రిఫరీ రాంబాబు,ఇస్ పెంటి రామాంజనేయులు, లక్ష్మణ్, పర్యవేక్షించగా, కేవీకే స్టేడియం వాలీబాల్ కోచ్ ధనుంజయ్ మరియు పి.డి లు తదితరులు పాల్గొన్నారు.


