NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డ్వాక్రా సంఘాలకు బ్యాటరీ సైకిళ్ల పంపిణీ: ఎమ్మెల్యే

1 min read

పెనమలూరు , న్యూస్​ నేడు:   నియోజకవర్గం పోరంకి తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో  డ్వాక్రా సంఘాల మహిళలకు , వారి కుటుంబసభ్యులకు ఉపయోగపడేలా, కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు  ఆధ్వర్యంలో బ్యాటరీ సైకిళ్ల వినియోగం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించేలా కృషి చేస్తున్నామన్న ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ , 40 మంది డ్వాక్రా మహిళలకు బ్యాటరీ సైకిళ్లను అందచేశారు. రాష్ట్రంలో ఇంధన వాడకం తగ్గించేలా కాలుష్య రహిత వాతావరణం కల్పించేలా, ఆరోగ్యకరమైన వాతావరణం, వ్యాయామ సౌకర్యం పెంపొందించేలా ప్రజలకు, సమాజానికి ఉమ్మడి సౌకర్యం ఏర్పాటు ఉండేలా, ఇంధన వినియోగ రూపంలో ప్రజలు వెచ్చిస్తున్న ఖర్చును తగ్గించేలా,  40,000 విలువ చేసే, బ్యాటరీ సైకిళ్లను 24000 రూపాయలకే అందించేలా ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు  కృషితో రాష్ట్ర వ్యాప్తంగా బ్యాటరీ సైకిళ్ల వినియోగం అందుబాటులోకి తీసుకువస్తున్నామన్న ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ , డ్వాక్రా మహిళలు కాకుండా ఇతరులకు ఎవరికైనా బ్యాటరీ సైకిళ్లు కావాలనుకుంటే 24000 రూపాయలే పూర్తి నగదు చెల్లింపు ద్వారా తక్షణ పంపిణీ చేస్తామని తెలిపారు..ఈ కార్యక్రమంలో తాడిగడప మున్సిపాలిటీ అధ్యక్షులు అనుమోలు ప్రభాకర్ రావు మరియు రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్ నర్సు రాజ్యలక్ష్మి సంగేపు రంగారావు దేవినేని రాజా కోయ ఆనందప్రసాద్ మారుపూడి ధన కోటేశ్వరరావు ఏం చైర్మన్ కొండా  ప్రవీణ్ అనే దన రామ కోటేశ్వరరావు తుమ్మలపల్లి హరికృష్ణ బిజెపి నాయకులు ఏ కుల విజయంద్ర కంచిపాడు మండల పార్టీ అధ్యక్షులు జపన వెంకటేశ్వరరావు జనసేన నాయకులు తతపూడి గణేష్ కూటమి నాయకులు, అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

About Author