NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పర్యావరణ పరిరక్షణతో  అభివృద్ధికి అవకాశం – జిల్లా కలెక్టర్

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు : పర్యావరణ పరిరక్షణతో  అభివృద్ధికి అవకాశం   లభిస్తుందని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు..శనివారం కలెక్టరేట్ లో  పర్యావరణంలో అవకాశాలు అన్న థీమ్ తో నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్,  జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, అధికారులు పాల్గొన్నారు.తొలుత  కలెక్టరేట్ లోని  ప్రభుత్వ కార్యాలయాల్లో   జిల్లా కలెక్టర్ పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహం వరకు  అధికారులతో  కలిసి నడుచుకుంటూ వెళ్లి  అక్కడ స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు.  అనంతరం సునయన ఆడిటోరియం ఆవరణలో జాయింట్ కలెక్టర్, డిఆర్వో, అధికారులతో కలిసి కలెక్టర్ చెత్తను ఊడ్చి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం లో భాగంగా పర్యావరణంలో అవకాశాలు  అనే థీమ్ తో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర  కార్యక్రమాల ద్వారా ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాలు, చెట్లను పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణ, తడి చెత్త, పొడి చెత్త ను వేరు చేయడం అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించామన్నారు.ఆ వివరాలను ఈరోజు సాయంత్రం లోపు  తనకు పంపించాలని  కలెక్టర్ స్పెషల్ కంట్రోల్ రూమ్ సిబ్బందిని ఆదేశించారు.. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, కలెక్టరేట్ ఏఓ శివరాముడు, తదితరులు పాల్గొన్నారు.

About Author