NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్యాపిలికి హంద్రీనీవా సాగునీరు–తాగునీరు, టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి

1 min read

–సిపిఐ మండల కార్యదర్శి జె.మహేష్

ప్యాపిలి, న్యూస్​ నేడు:  ప్యాపిలి మండలానికి హంద్రీనీవా సాగునీరు–తాగునీరు, టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని సిపిఐ మండల కార్యదర్శి జె.మహేష్ అన్నారు. ఈసందర్భంగా శనివారం ప్యాపిలి  పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆందోళన నిరసన కార్యక్రమని నిర్వహించారు.సిపిఐ మండల కార్యదర్శి జె మహేష్ మాట్లాడుతూప్యాపిలి మండల ప్రజల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) డిమాండ్ చేసింది. మండలంలోని రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మహేష్ తెలిపారు.ప్యాపిలి మండలానికి హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా సాగునీరు మరియు తాగునీరు అందించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని, మండలంలోని రైతులు వర్షాధార పంటలపై ఆధారపడి తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. హంద్రీనీవా నీరు అందితే వేల ఎకరాల భూమి సాగులోకి వచ్చి రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని,ఇక మండలంలో పెద్ద ఎత్తున టమాటా పంట సాగు జరుగుతున్నప్పటికీ సరైన మార్కెట్ లేక రైతులు నష్టపోతున్నారు. అందువల్ల ప్యాపిలి మండలంలోనే టమాటో జ్యూస్/ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని సిపిఐ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఫ్యాక్టరీ ఏర్పాటైతే రైతులకు సరైన ధర లభించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి.అలాగే విస్తీర్ణపరంగా పెద్దదైన ప్యాపిలి మండలాన్ని ప్రజల పరిపాలన సౌలభ్యం దృష్ట్యా రెండో మండలంగా విడగొట్టి జలదుర్గం మండలంగా ప్రకటించాలి. ఇది జరిగితే గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత త్వరగా అందుబాటులోకి వస్తాయని సిపిఐ పేర్కొంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకుల పట్టణ కార్యదర్శి వెంకటేష్, నాగన్న,ఏఐటీయూసీ నాయకులు నాగన్న, చంద్రశేఖర్, రాజు, రామంజి, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

About Author