NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి

1 min read

వార్డులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి

జిల్లాలో లెప్రసీ (కుష్టు వ్యాధి) నిర్మూలన దిశగా ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలి

హాస్పిటల్ లో నీరు, విద్యుత్, మరుగుదొడ్ల వంటి సౌకర్యాలు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి

జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

కర్నూలు, న్యూస్ నేడు : ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో ఉండి  రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని,  జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి  ఆదేశించారు.శుక్రవారం ఉదయం స్థానిక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని వార్డుల్లో తిరిగి రోగులకు వైద్య సేవలు అందిస్తున్న తీరును పరిశీలించారు. క్యాజువాలిటీ, ఎమర్జెన్సీ, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, న్యూరో సర్జరీ, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ యూనిట్, మానసిక రోగుల వార్డు, డెర్మటాలజిస్ట్ వార్డు, ఫిమేల్ ఆర్థో, మేల్ ఆర్థో తదితర వార్డ్ లను కలెక్టర్ పరిశీలించి రోగుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా క్యాజువాలిటీ వార్డు ను పరిశీలిస్తూ అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్న తిమ్మప్ప అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ  ఎక్కడ నుండి వచ్చారు, ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తున్నారని  ఆరా తీశారు..వివరాలు తెలుసుకుని, అతనికి  ఐ సి యు లో బెడ్ సిద్ధం చేయాలని కలెక్టర్ జి జి హెచ్ సూపరింటెండెంట్ ను ఆదేశించారు.వైద్యాధికారులతో మాట్లాడుతూ, ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో ఉండాలని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సిబ్బంది సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు.లెక్టర్ వెంట  జి జి హెచ్ సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వర్లు, ఇంచార్జి డి ఎం హెచ్ ఓ డా.భాస్కర్, ఇంచార్జి సి హెచ్ ఆర్ ఎం ఓ డా.వెంకటరమణ, జి హెచ్  ఏఓ సింధు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

About Author