NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెండింగ్లో ఉన్న పెన్షనర్ల ఆర్థిక బకాయిలు వెంటనే విడుదల చేయాలి

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: రాష్ట్ర ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ ,విజయవాడ పిలుపుమేరకు, ఈ రోజు ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్,  కర్నూలు జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు మరియు ఏపీ జేఏసీ చైర్మన్ వి జవహర్ లాల్  సభ అధ్యక్షతన స్థానిక ఎన్జీవో హోమం, నందు ఈరోజు జరుపబడింది..

ముఖ్యంగా ఈ సమావేశంలో చర్చించిన అంశాలు…

సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగ ,ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల ఆర్థిక బకాయిలు వెంటనే విడుదల చేయాలి

అందులో ప్రధానంగా..

1, వెంటనే 12 వ పీఆర్​సి ఏర్పాటు చేయాలి.. 2, అంతవరకు IR ను ప్రకటించాలి..3, పెండింగ్ లో ఉన్న నాలుగు సరెండర్ లీవ్ ల ను వెంటనే విడుదల చేయాలి…4, దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఐదు డిఏలలో వెంటనే రెండు డిఏలు విడుదల చేయాలి…5, పెన్షనర్లకు అడిషనల్ క్వాంటం ఆప్ పెన్షన్ వారి కోరిక మేరకు అమలు చేయాలి.కనుక రాష్ట్ర ప్రభుత్వము వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించిన ఆర్థిక పరమైన డిమాండ్లను, మరియు ఆర్థికేతర డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి..లేనిపక్షంలో రేపు 5వ తేదీ రాష్ట్ర జేఏసీ కార్యవర్గం పిలుపుమేరకు భవిష్యత్తు కార్యాచరణకు సిద్ధమవుతామని, అంతే కాకుండా అవసరమైతే ఉద్యమాలకు ముందుకు వెళ్దామని ఈ సందర్భంగా సమావేశంలో డిమాండ్  చేయడమైనది…

ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి

ఎం.సి.కాశన్న, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ఈశ్వరయ్య,జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణమోహన్, సాంబశివారెడ్డి, సురేష్,కర్ణ, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ రామకృష్ణారెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శిలు, కేసిహెచ్ కృష్ణుడు, సత్యనారాయణ రాజు, నాగ కిషోర్,సుధాకర్, డాక్టర్ కార్తీకలక్ష్మి,జిల్లా కోశాధికారి భాస్కర్ నాయుడు, మరియు కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా అధ్యక్ష/ కార్యదర్శులు సాయిబాబా, రమేష్, ఎమ్మిగనూరు తాలూకా అధ్యక్ష కార్యదర్శులు మద్దిలేటి, వరప్రసాద్, కోడుమూరు తాలూకా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస యాదవ్, చంద్రశేఖర్ , కర్నూల్ నగర అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ, సాయిరాం, ఆలూరు తాలూకా అధ్యక్ష కార్యదర్శులు మోహన్, శేఖర్, ఆదోని తాలూకా ఇంచార్జీ అధ్యక్షలు మంజునాథ్, కార్యదర్శి, బజారి, ఇంకా ఇతర  నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *