NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దసరా కానుకగా పెన్షన్ పంపిణి

1 min read

హొళగుంద న్యూస్ నేడు : హొళగుంద మండల కేంద్రంలోని స్థానిక బీసీ కాలనీ, బడుగుజంగం ఏరియా, బుడబుక్కల కాలని తదితర కాలనీలలో మండల కన్వీనర్ టి. తిప్పయ్య మరియు టిడిపి రాష్ట్ర నాయకులు చిన్నహ్యట శేషగిరి’ల కూటమి బృందం దసరా కానుకగా వితంతువులు, దివ్యాంగులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నిర్వహించిన పెన్షన్ల పంపిణీ వాడవాడలా వేడుకై వెరజల్లింది. మండల కన్వీనర్ తిప్పయ్య  మరియు టిడిపి నాయకులు చిన్నహ్యట శేషగిరి  మాట్లాడుతూ దశాబ్దాలుగా ఆలూరును పట్టిపీడిస్తున్న వెనుకబాటుతనపు నిర్మూలన మరియు తెలుగుదేశం పార్టీ పునర్ వైభవానికి  వైకుంఠం దంపతుల సంయుక్త నాయకత్వం సమర్థవంతంగా అభివృద్ధి వైపు అడుగులేస్తుందని ఇక ఆలూరులో ప్రజలు ఆశించిన మార్పు మొదలవుతుందని అది వైకుంఠం దంపతుల కార్యదక్షతతోనే సుసాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు చిదానంద, టిడిపి బూత్ ఇంచార్జ్ మల్లికార్జున, వలి బాషా, లక్ష్మన్న, జంబయ్య, మంగయ్య, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

About Author