శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి ఆలయంలో 3వరోజు శ్రీ అన్నపూర్ణదేవి అలంకారం
1 min read

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో 3వరోజు శ్రీ మీనాక్షిదేవి అలంకారం
చెన్నూరు, న్యూస్ నేడు: మండల కేంద్రమైన చెన్నూరులో దసరా శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి.శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి ఆలయంలో బుధవారం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీ గణపతి పూజ. అమ్మవారికి ప్రత్యేక అభిషేక పూజలు కుంకుమార్చన నిర్వహించారు. సాయంత్రం ఏడు గంటల నుంచి అలంకార ఉభయ దారులు చే శ్రీ అన్నపూర్ణదేవి దేవి అలంకారం ఆలయ కమిటీ నిర్వాహకులచేనిర్వంచారు. ప్రసాదం ఉభయ దారులచే అమ్మవారికి పూజలు నిర్వహించారు.సాయంత్రం ఏడు గంటలకు తర్వాత అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. భక్తులకు ఆలయ కమిటీ నిర్వాహకులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం భక్తులకు మచ్చ పెద్ద సుబ్బరాయుడు కుటుంబ సభ్యులు అల్పాహారం ఏర్పాటు చేశారు.బ్రాహ్మణ వీధిలో వెలసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో 3వరాజు ఉదయం అమ్మవారికి అభిషేక పూజలు పూల అలంకరణ నిర్వహించారు. సాయంత్రం ఏడు గంటల నుంచి అమ్మవారు శ్రీ మీనాక్షిదేవి అలంకారంతో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ నిర్వాహకులు అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.ఆలయాలు వద్ద కమిటీ నిర్వాహకులుచేభక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. చెన్నూర్ లో జరిగే శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చెన్నూరు సిఐ కృష్ణా రెడ్డి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.


