అర్ టి ఇ ఫ్రీ సీట్ వచ్చిన పిల్లల సమస్యపై ఎంపీడీవో ,ఎం ఈ ఓ కు వినతి
1 min read

వినతి పత్రం ఇచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు
న్యూస్ నేడు హొళగుంద: కర్నూలు జిల్లా ఆలూరు తాలూక హొళగుంద మండల నందు రైట్ టు ఎడ్యుకేషన్ ఇందులో అప్లై చేసుకున్న విద్యార్థిని విద్యార్థులకు ఫ్రీ సీట్ రావడం జరిగింది తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మా పిల్లలకు తల్లికి వందనం అమౌంట్ పడలేదని మరియు ఆర్టీఈ ఫ్రీ సీట్ రావాలని కోరుతున్నాము ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే ఒకరికి ఆర్టీఈ ఫ్రీ సీట్ వచ్చింది కానీ మిగతా ఇద్దరు పిల్లలకు కూడా ఆర్టీ ఇ ఫ్రీ సీట్ లో ఉందని ఆన్లైన్లో చూపిస్తుంది అని విద్యార్థుల తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సీటు వచ్చింది మాత్రం ఒకరికి అయితే రేషన్ కార్డు లో ఎంతమంది ఉంటే అంతమందికి ఆర్ టి ఈ ఫ్రీ సీట్ ఆన్లైన్లో చూపిస్తుంది ఈ సమస్యకు పరిష్కారం చూపనాలని ఎంపీడీవో మరియు ఎంఈఓ ని కోరడం జరిగింది ఆర్ టి ఈ ఫ్రీ సీటు వచ్చిన విద్యార్థులకు ప్ప్రైవేట్ స్కూల్ యజమానులు ఫీజులు వసూలు చేస్తున్నారు స్కూల్ యాజమాన్యాలకు అడిగితే మాకు అమౌంట్ పడలేదని మీరే కట్టాలని వాదించి మరీ ఫీజులు వసూలు చేస్తున్నారు అయినా సరే ముగ్గురు పిల్లలు ఒక్కరికి ఫ్రీ సీట్ వచ్చిందిలే మిగతా ఇద్దరు పిల్లలకు తల్లికి వందనాలు అమౌంట్ పడుతుందని అనుకుంటే వాళ్ల పేర్లు కూడా ఆర్టీఈ అని ఆన్లైన్లో చూపిస్తుంది ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్న సీటు మాత్రం ఒకరికి వచ్చింది మిగతా ఇద్దరు పిల్లలు కూడా అలాగే చూపిస్తుంది ఈ సమస్యను పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు.


