దామోదర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన భూషి గౌడ్..
1 min read

నందికొట్కూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా పగిడ్యాల సహకార సొసైటీ చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన దామోదర్ రెడ్డి ప్రమాణస్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది.నూతన చైర్మన్ దామోదర్ రెడ్డికి లక్ష్మాపురం గ్రామ టీడీపీ నాయకులు ఎన్.భూషిగౌడ్ పూల బోకేతో శుభాకాంక్షలు తెలిపారు.సోమవారం మధ్యాహ్నం పగిడ్యాలలో ఏర్పాటు చేసిన సొసైటీ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి మరియు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య హాజరయ్యారు.సహకార సొసైటీ సీఈవో ఖాజా దామోదర్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు.చైర్మన్ నియామక పత్రాన్ని సీఈఓ చైర్మన్ కు అందించారు. శివానందరెడ్డి మరియు ఎమ్మెల్యే దామోదర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ పదవి రావడానికి కృషిచేసిన ఎమ్మెల్యేకు మరియు శివానందరెడ్డికి నూతన చైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా రైతులకు అందుబాటులో ఉండి రైతుల సమస్యలను పరిష్కరిస్తానని ఆయన తెలిపారు.

