కరాటే స్టూడెంట్స్ కి బ్లాక్ బెల్టులు అందజేత
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు యునైటెడ్ క్లబ్ నందు కెన్షిన్ కై గోజు ర్యూ కరాటే ఏపీ ఈ సంబంధించి సీకే కరాటే అకాడమీ కర్నూలు వారు బెల్టు గ్రేడింగ్ టేషన్ నిర్వహించడం జరిగింది . ఇందులో ముఖ్యఅతిథిగా షేక్ మహబూబ్ బాషా డిఎస్పి స్పెషల్ పోలీస్ కర్నూలు , గ్రాండ్ మాస్టర్ షిహాన్ సి సెల్వకుమార్ ఫిఫ్త్ డే అండ్ బ్లాక్ బెల్ట్ పాల్గొనడం జరిగింది. డీఎస్పీ షేక్ మహబూబ్ బాషా మరియు సెల్వ కుమార్ కరాటే స్టూడెంట్స్ కి బెల్టులు అందజేయడం జరిగింది. శ్రీ వైష్ణవి, వైష్ణవి,వివేక్,పర్వీన్,జస్వంత్ విద్యార్థులకు బ్లాక్ బెల్ట్ అందజేయడం జరిగింది. రాముడు మాస్టర్ చిన్న మాస్టర్ వెంకటేష్ మాస్టర్ ఫాతిమా మాస్టర్లు ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా నిర్వహించారు.డీఎస్పీ షేక్ మహబూబ్ బాషా విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. పిల్లలకు సరైన ప్రోత్సాహాన్ని అందిస్తే వారు పోలీస్ జాబ్స్ మరియు మిలిటరీ జాబ్స్ లలో రాణిస్తారు .అని చెప్పడం జరిగింది . మరియు స్పోర్ట్స్ కోటాలో రెండు శాతం నుండి మూడు శాతానికి రిజర్వేషన్ పెంచడం జరిగింది కాబట్టి ఈ కరాటే నేర్చుకోవడం చాలా బాగా వారికి ఉపయోగపడుతుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషంగా ఉందని డిఎస్పి మనస్పూర్తిగా వ్యాఖ్యానించడం జరిగింది.

