‘రెండేళ్ల నమ్మకం’లో దూసుకెళ్తున్న ఎమ్మెల్యే..మాండ్ర
1 min read
వీరాపురంలో ఎమ్మెల్యే.. బిజినవేములలో మాండ్ర
నందికొట్కూరు న్యూస్ నేడు: కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రెండేళ్ల నమ్మకం-అభివృద్ధి సంక్షేమం’ కార్యక్రమాన్ని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య మరియు నందికొట్కూరు మండల కన్వీనర్ మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి ప్రజల వద్దకు వెళ్తూ గత రెండేళ్ల పాలనలో ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి వివరించడంలో వీరు ప్రజల్లోకి చొచ్చుకెళ్తున్నారు. బుధవారం కొత్తపల్లి మండలం వీరాపురం గ్రామంలో ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్తూ ప్రభుత్వం అందించిన పథకాలు అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తూ ముందుకెళ్లారు.ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సేవలు,సంక్షేమ ఫలాలు మరింత చేరువయ్యేలా కృషి చేస్తున్నామని తెలిపారు.
బిజినవేములలో ఇంటింటికీ మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి
నందికొట్కూరు మండలం బిజినవేముల గ్రామంలో రెండేళ్ల నమ్మకం కార్యక్రమం మాజీ సర్పంచ్ రవి యాదవ్ ఆధ్వర్యంలో మండల కన్వీనర్ మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి,మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను ప్రజలకు అందజేశారు.ఈ కార్యక్రమంలో కొత్తపల్లి లింగస్వామి గౌడ్, నందికొట్కూరు అబ్జర్వర్ వెంకట శివుడు,క్లస్టర్ ఇంచార్జ్ నారపరెడ్డి కార్యకర్తలుమరియు అధికారులు పాల్గొన్నారు.



