వైసీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు..
1 min read

సిద్ధార్థ రెడ్డి హౌస్ అరెస్ట్..నేతల నిరసన
నందికొట్కూరు, న్యూస్ నేడు: వైసీపీ పార్టీ చేపట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా నందికొట్కూరు నుండి నంద్యాలకు వెళ్తున్న నందికొట్కూరు వైసీపీ ఇన్చార్జి డాక్టర్ ధారా సుధీర్ మరియు నాయకులను నందికొట్కూరు పోలీసులు అడ్డుకున్నారు. నంద్యాల ఛలో మెడికల్ కాలేజ్ కార్యక్రమానికి నందికొట్కూరు నియోజకవర్గం నుండి పలు వాహనాల్లో నాయకులు కార్యకర్తలు వెళ్తూ ఉండగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల దగ్గర నంద్యాలకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.తర్వాత పట్టణంలోని పటేల్ సెంటర్ కేజీ రోడ్డుపై డాక్టర్ దారా సుధీర్ మరియు నాయకులు కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ సుదీర్ మాట్లాడుతూ వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కట్టించారు.ఈ కాలేజీల్లో పేద ప్రజలు ఈ కాలేజీల్లో వైద్య విద్యను చదువుతారని వారి చదువు అనంతరం గ్రామాల్లో ఉన్న పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తారని ఈ కాలేజీ లను ప్రైవేటీకరణను ప్రభుత్వం రద్దు చేయాలని లేనిపక్షంలో ఉద్యమం రాష్ట్రమంతా ఉదృతం చేస్తామని అన్నారు.తర్వాత కర్నూలులో వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మన్సూర్, పుల్యాల నాగిరెడ్డి, జెడ్పిటిసి జగదీశ్వర్ రెడ్డి,రమేష్ నాయుడు,నాగ తులసి రెడ్డి, చిన్న మల్లారెడ్డి వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

