NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బీసీలకు రాజ్యాధి కారం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం

1 min read

చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ చిన బాబు గెలుపుకి కృషిచేద్దాం

బీసీల ఐక్యత సమావేశంలో బీసీ నాయకుల తీర్మానం

మదనపల్లె  న్యూస్ నేడు ప్రతినిధి  : అన్నమయ్య జిల్లా, మదనపల్లి మునిసిపల్ ఛైర్మన్ ఎన్.డి.ఏ కూటమి టిడిపి అభ్యర్థి శ్రీరామ్ కుమార్ (చినబాబు) ను గెలిపించుకుందామని బీసీ కులాల నాయకులు పేర్కొన్నారు. ఆదివారం శ్రీకృష్ణ కల్యాణ మండపం లో బీసీ కులాల నాయకుల ఆధ్వర్యంలో ఐక్యత సమావేశం నిర్వహించారు.యెనుగొండ రాజగోపాల్ నాయుడు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులు గా కూటమి చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ కుమార్ (చినబాబు) విచ్చేశారు. ఈ సందర్భంగా ఆ శ్రీరామ్ చినబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ ముద్దు బిడ్డగా ఎదిగిన తనకి కూటమి పార్టీలు మదనపల్లె మునిసిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా కేటా యించడంతో అందరూ కృతజ్ఞత లు తెలియచేస్తూ, మునిసిపల్ పరిధి లో వార్డులలో ప్రజా సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కరిస్తానని  అన్నారు. బీసీల బిడ్డగా నన్ను ఆదరించి కూటమి అభ్యర్థులతోపాటు చైర్మన్ అభ్యర్థిగా నన్ను గెలిపించా లని  విజ్ఞప్తి చేశారు.రాష్ట్ర,కేంద్ర  నిధులు తెచ్చి మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తానని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో మంత్రులు, కూటమి పార్టీల ముఖ్య నాయకులతో తనకు ఉన్న పరిచయాలతో నిధులను తీసుకు వచ్చి మదనపల్లె ని సుందరంగా తీర్చిదిద్దే  బాధ్యత  తీసుకుంటానన్నారు. బీసీలకు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు రుణపడి ఉందా మని,మదనపల్లె మున్సిపాలిటీలో ఘన విజయం సాధించి ఆయనకు కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు మోడెమ్ వెంకట రమణ,బి.కృష్ణ మూర్తి,డివి రమణ,కప్పల శ్రీరాములు,వై.కొండయ్య,నారా రెడ్డెప్ప, జె.రెడ్డెప్ప,ఓర్సు వీర భాస్కర్,పి.అంజి,నాగరాణి,శ్యామల,విజయమ్మ,శంకర్ యాదవ్,సురేష్ యాదవ్,హరికృష్ణ,మంజునాథ్, యాలగిరి దొరస్వామి నాయుడు,రామమూర్తి,ముసలికుంట నాగయ్య, ప్రభాకర్,టెంపర్ రాజేష్,వాల్మీకి శీన,బీసీ నాయ కులు మణి, నాగరాజ, మాజీ మునిసిపల్ చైర్మన్ కొడవలి శివ ప్రసాద్,సి.రామాంజులు, వీరభద్ర, వెంకటరమణ,పూజారి అంజి,బిసి నాయకులు ప్రభాకర్,లోకేష్,వేమయ్య, సొసైటీ రామచంద్ర,ఈడిగ సంఘం క్రిష్ణమూర్తి, బొంబాయి దుర్గ బెస్త,సాదిరి నాగరాణి,మల్లూరు సునీత,విద్యార్ధి సంఘాల నాయకులు వి.ఉత్తన్న, గంగరాజు,గణేష్ లు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *