NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

45,47 వార్డుల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తా

1 min read

వైకాపా కౌన్సిలర్ అభ్యర్థులు శీలం రమణమ్మ,శీలం రమేష్ స్పష్టం

మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి : త్వరలో జరగబోవు మున్సిపల్ ఎన్నికల్లో తమకు అవకాశం కల్పిస్తే 45,47 వార్డుల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తామని వైయస్సార్సీపి కౌన్సిలర్ అభ్యర్థులు శీలం రమణమ్మ,శీలం రమేష్ పేర్కొన్నారు. ఆదివారం పార్టీ శ్రేణులతో కలిసి రెండు వార్డులలో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.ఈ ప్రచారానికి కురబ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ దండు రామాంజులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ గత వైసీపీ ప్రభుత్వంలో నేతన్న నేస్తం ద్వారా అర్హులందరికీ రూ.24 వేలు నగదు జమ చేయడం జరిగిందన్నారు.అయితే కూటమి ప్రభుత్వంలో అమలు చేస్తున్న నేతన్న సేవలో పథకం అవినీతి మయంగా మారిందన్నారు.ఇది కూటమి నేతలకు చేతివాటంగా మారి వారికి అనుకూల మైన వారికి పథకం యొక్క లబ్ధిని చేకూర్చారని విమర్శించారు.ఎంపీ మిథున్ రెడ్డి సహకారంతో మదనపల్లి పట్టణంలో చేనేత భవనం నిర్మించా మని,చేనేత కార్మికులకు అండగా నిలిచా మని గుర్తు చేశారు.గత ప్రభుత్వం చేసిన మేలును దృష్టిలో ఉంచుకొని చేనేత కార్మికులు వైసీపీ ప్రభుత్వానికి చేనేత కార్మికులకు అండగా నిలవాల న్నారు.అనంతరం శీలం రమణమ్మ, రమేష్ దంపతులు మాట్లాడుతూ గతంలో తొగట కార్పొరేషన్ డైరెక్టరుగా సమర్థవంతంగా పనిచేశామని,అర్హులైన చేనేత కార్మికులకు రుణాలు మంజూరు చేయించామని తెలిపారు.ప్రస్తుతం కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నామని,మాకు ఒక అవకాశం కల్పిస్తే వార్డుల్లో మౌలిక సదుపా యాల కల్పనకు కృషి చేయడంతో పాటు,ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. కావున నవంబర్ 1వ తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికల్లో 45,47 వార్డులలో మాకు, చైర్మన్ అభ్యర్థిగా జింకా వెంకటా చలపతికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను వారు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో రామిశెట్టి చంద్రకళ, అమరనాథ్ రెడ్డి, శివారెడ్డి, సురేష్, మల్ రెడ్డి, రామచంద్ర, చెన్నకేశవ,అంజి,బాబు,కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *