NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైఎస్ఆర్సిపి ప్రభుత్వ పథకాలే మా అభ్యర్థులను గెలిపిస్తాయి

1 min read

మాజీ మున్సిపల్ చైర్మన్ మనుజారెడ్డి

35 వార్డులో శారదా రెడ్డికి మద్దతుగా ప్రచారం

మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి : గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులే ఈ మున్సిపల్ ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులను గెలుపు తీరాలకు నడిపి స్తాయని మదనపల్లె మాజీ మున్సిపల్ చైర్మన్ మనుజారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని 35 వ వార్డు వైఎస్ఆర్సిపి కౌన్సిలర్ అభ్యర్థి బి.శారదమ్మ ( శారదా రెడ్డి ) కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడపగడపకు వెళ్లి ఓటర్లను కలుసు కున్నారు. గత ప్రభుత్వం లో వార్డులో తాము చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తించి తమ పార్టీ అభ్యర్థిని ఆశీర్వదించాలని కోరారు. శారదా రెడ్డి ప్రజలకు  సుపరిచితు రాలుగా నిత్యం ప్రజలతో మమేకమై, కలసి పనిచేసే వ్యక్తి అని గుర్తు చేశారు. కావున ఒకటవ తేదీ జరిగే మునిసిపల్ ఎన్నికలలో  ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. గత ప్రభుత్వంలో కుల, మత, రాజకీయాలకు అతీతంగా పేదరికమే అర్హతగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించామని, అభివృద్ధికి వార్డులో పెద్దపీట వేయడం జరిగిందని గుర్తుచేశారు.  కావున మదనపల్లె మున్సిపాలిటీలో వైఎస్ఆర్సిపి చైర్ పర్సన్ అభ్యర్థిగా జింక వెంకటా చలపతికి, 35 వవార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా శారద రెడ్డికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి, వేయించి గెలి పించాలని విజ్ఞప్తి చేశారు. 35 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి శారదా రెడ్డి మాట్లాడుతూ ప్రజలు తనకు అవకాశం ఇస్తే పూర్తి సమయం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి, వార్డు అభివృద్ధికి అత్యంత ప్రాధా న్యత ఇస్తామని తెలిపారు. వార్డు ప్రజలు తనను మీ కుటుంబ సోదరిగా గుర్తించి ఆశీర్వ దించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్య క్రమంలో పార్టీ కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *