ఏలూరు D5 సెక్షన్ పరిధిలో విద్యుత్ కు అంతరాయం
1 min read

34/11 కె.వి సుంకర వారి తోట సబ్స్టేషన్ లో మరమ్మత్తులు
ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విద్యుత్ నిలుపుదల
వినియోగదారులు సహకరించాలని మనవి
కె.ఎం అంబేద్కర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు మండలం,ఏలూరు D5 సెక్షన్ పరిధి లో ఉన్న 33/11KV సుంకరివారితోట సబ్ స్టేషన్ లో మరమ్మత్తు మరియు నిర్వహణ ఉన్నందున ఆ పరిధిలో గల మాడేపల్లిరోడ్, సుంకరివారి తోట, ప్రేమలయం,గాయత్రి నగర్,వెంకటాపురం ఎంపీ రోడ్,జాలిపూడి, లింగరావుగూడెం, కాట్లంపాడు, శ్రీపర్రు, మనూరు, పురం మరియు కలకుర్రు గాను ది. 19-07-2025 (శనివారం) నాడు ఉదయం 8.00 గం.ల నుండి 10.00 గం.ల వరకు పైన పేర్కొన్న పరిసర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడునని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్ ,ఏలూరు కె.యం అంబేద్కర్ తెలిపారు. కావున వినియోగదారులు గమనించి సహకరించవలసినదిగా కోరారు.

