రైతులకు నాణ్యమైన ఎరువులు అందించడమే తెదేపా లక్ష్యం
1 min read

: ఉమ్మడి కర్నూలు జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ వై.నాగేశ్వర రావు యాదవ్
ప్యాపిలి, న్యూస్ నేడు: రైతులకు నాణ్యమైన ఎరువులు అందించడమే తెదేపా లక్ష్యం అని ఉమ్మడి కర్నూలు జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ వై.నాగేశ్వరావు యాదవ్ అన్నారు.డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కి ఆదేశాల మేరకుప్యాపిలి పట్టణంలో డిసిఎంఎస్ కార్యాలయాలను ప్రారంభించారు.ఉమ్మడి కర్నూలు జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ నాగేశ్వరావు యాదవ్ చేతుల మీదుగా రైతులకు యూరియా మరియు డిఏపి పంపిణీ చేశారు.ఎంఆర్పి రేట్లకు ఎరువుల పంపిణీ చేయాలని,మరియు రైతులకు ఎరువులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో తేదేపా మాజీ ఎంపిపి శ్రీనివాసులు , నాగేంద్ర, రామ్మోహన్, డిసిఎంఎస్ జీల్లా మెనేజర్ రాజేష్ కుమార్ , బ్రాంచ్ మేనేజర్లు. శారణ్య, షేక్ వలి , శివరంజని. రామిరెడ్డి , రైతులు తదితరులు పాల్గొన్నారు.


