పగటిపూట దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకవాలి
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రము పరిధిలో ఫ్రైడే-డ్రైడే కార్యక్రమాన్ని వైద్యులు డాక్టర్. ముషా హీద్ చౌదరి మరియు మాస్ మీడియా అధికారి ప్రకాష్ రాజ్పరిశీలించినారు,అనంతరం డాక్టర్ మాట్లాడుతు మాట్లాడుతూ చిన్నారులకు, వృద్ధులకు, రోగ నిరోధక శక్ల్తి తక్కువగా ఉంటుంది. కనుక వారి పట్ల పెద్దలు మరింత జాగ్రత్త పాటించాలి, దోమతెరలలో చిన్నారులు పడుకొనివ్వాలి. వారి చేతులకు, కాళ్ళకు దోమలు కుట్టకుండా చూసుకోవాలి. పగటిపూట దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకవాలి ,ఈడీస్ దోమలు కాటు మూలంగా డెంగ్యూ వ్యాధి వ్యాపిస్తుంది, ఈదోమలు పగటిపూటనే కుడుతాయి , అందుకు రాత్రి పూటతో పాటు పగటి పూట కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించినారు, మాస్ మీడియా అధికారి ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ఈడీస్ దోమలు మంచి నీటిలో పెరుగుతాయని ,ఇంటితో పాటు ఆవరణలో నీరు ఏక్కువ రోజులు నిల్వ లేకుండా చూసుకోవలసిన భాద్యత మీ పై ఉందని తెలిపారు. చుట్టుపక్కన చెత్తను తీసివేయకుంటే అక్కడే నిలిచిన నీటి కారణంగా ఈడీస్ , ఈజిప్ట్ దోమలు వృద్ధి చెందుతాయని వాటి కాటు వల్ల డేంగి వ్యాధి సోకే అవకాశాలు ఉంటాయన్నారు.ఈ కార్యక్రమములో,డెప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పద్మావతి , ఆశా కార్యకర్త మరియు ప్రొజెక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.


