వ్యాధుల నుంచి వీధి కుక్కలను రక్షించండి..
1 min read
వెలుగోడు , న్యూస్ నేడు: వీధి కుక్కలకు వచ్చే వ్యాధుల వల్ల ప్రజలకు హాని ఉందని,ప్రాణంతక వ్యాధుల నుంచి రక్షించాలని ఎస్ డి పి ఐ నాయకులు కోరారు. ఈ మేరకు వెలుగోడు తహసీల్దార్ శ్రీనివాసులు గౌడ్ కు సోమవారం ప్రజాదర్బార్ లో వినతిపత్రం ఇచ్చారు.ఈ సందర్బంగా మాట్లాడుతూవెలుగోడు గ్రామ పంచాయతీ పరిధిలో అనేక వీధి కుక్కలకు చర్మంపై ఉన్న వెంట్రుకలు పూర్తిగా ఊడిపోవడం, గజ్జి , ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వంటి సంక్రమణాత్మక చర్మ వ్యాధులు తీవ్రంగా వ్యాపిస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యాధిగ్రస్త కుక్కలు ప్రజా ప్రదేశాల్లో సంచరిస్తూ ప్రజలకు భయాందోళనలు కలిగించడమే కాకుండా, మానవులకు కూడా వ్యాధులు సోకే అవకాశం ఉండటంతో ప్రజారోగ్య భద్రతకు తీవ్రమైన ముప్పు ఏర్పడుతోందని అన్నారు.ప్రివెన్షన్ ఆఫ్ క్రూరెల్టీ టు అనిమల్స్ యాక్ట్, 1960 యొక్క నిబంధనల ప్రకారం, జంతువులకు సరైన సంరక్షణ, వైద్య చికిత్స అందించడం స్థానిక సంస్థల చట్టబద్ధమైన బాధ్యతగా చెప్పారు. అదేవిధంగా యానిమల్ బర్త్ కంట్రోల్ (డాగ్స్) రూల్స్, 2001 ప్రకారం వీధి కుక్కల ఆరోగ్యం, నియంత్రణ మరియు ప్రజారోగ్య పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టవలసిన బాధ్యత గ్రామ పంచాయతీ మరియు సంబంధిత అధికారులపై ఉందని అన్నారు.భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడికి కల్పించబడిన జీవన హక్కులో భాగంగా ప్రజారోగ్య పరిరక్షణ కూడా అంతర్భాగమై ఉంటుంది. ఈ క్రమంలో, వీధి కుక్కల వల్ల ప్రజలకు ఆరోగ్యపరమైన ప్రమాదం ఏర్పడినప్పుడు, సంబంధిత స్థానిక సంస్థలు తక్షణ నివారణ చర్యలు తీసుకోవాల్సిన చట్టపరమైన బాధ్యత కలిగి ఉన్నాయని తెలియజేస్తున్నాము. పై చట్టాలు మరియు నిబంధనలను అమలు చేస్తూ తక్షణమే చర్యలు చేపట్టవలసిందిగా కోరారు. చర్మ వ్యాధిగ్రస్త కుక్కలకు తగిన చికిత్స మరియు అవసరమైన వ్యాక్సినేషన్ అందించుట.తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న కుక్కలను తాత్కాలికంగా వేరుచేసి చికిత్స చేయుట. గ్రామంలో పారిశుద్ధ్య మరియు వ్యర్థాల నిర్వహణ చర్యలను మరింత పటిష్టం చేయుట. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా నిరంతర పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గౌస్,కార్యదర్శి తౌసిఫ్, కమిటీ సభ్యులు ఇంతియాజ్ పాల్గొన్నారు.

