NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గ్రామ ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించాలనే ఉద్దేశం : ఎమ్మెల్యే కోట్ల

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: గ్రామ ప్రజలకు ఎటువంటి అంతరాయం లేకుండా శుద్ధమైన తాగునీరు అందించాలనే ఉద్దేశం మని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి అన్నారు.ప్యాపిలి మండలంలోని గుట్టలపల్లె ,వంక మేటుపల్లి, కౌలుపల్లె,బురుగుల గ్రామాల్లో జరుగుతున్న తాగునీటి పైపుల పునరుద్ధరణ పనులను సోమవారం డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి పరిశీలించారు. గ్రామ ప్రజలకు ఎటువంటి అంతరాయం లేకుండా శుద్ధమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.ఈ సందర్భంగా పైపుల మార్పిడి, లీకేజీల నివారణ, సరఫరా లైన్ల బలపరచడం వంటి పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో మరియు గ్రామ ప్రజలతో ఎమ్మెల్యే  సమీక్ష  నిర్వహించారు. పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని, నిర్దేశిత గడువులోపు పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచనలు ఇచ్చారు.గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యలను అడిగి తెలుసుకుని, అవసరమైన చోట అదనపు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే  హామీ ఇచ్చారు. ప్రజలకు మౌలిక వసతుల మెరుగుదల ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే  పేర్కొననున్నారు. ఈ కార్యక్రమంలో తేదేపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author