బాలికల రక్షణ – బాలల హింసా రహిత గ్రామ రూపకల్పనే మా లక్ష్యం
1 min read
తాడేపల్లి , న్యూస్ నేడు: గుడ్ షెఫర్డ్ కాన్వెంట్ సిస్టర్స్ చైల్డ్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ సిస్టర్ నీరజ ఆద్వర్యంలోబుధవారం ఉదయం తాడేపల్లి మండలం ప్రాతూరు గ్రామ సచివాలయం నందు గ్రామ స్థాయి బాలల రక్షణ, పరిరక్షణా చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ ఏర్పాటు చేయటం జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ సిస్టర్ నీరజ మాట్లాడుతూ బాలబాలికల రక్షణ,వారి అభివృద్ది కోసం పని చేయుటలో మా సంస్థ ఎప్పుడు ముందుంటుందని తాడేపల్లి మండలం తో పాటు మంగళగిరి,పెదకాకాని, తుళ్ళూరు ఈ నాలుగు మండలాలలో కూడా బాలల హక్కుల గురించి, కిశోర బాలికలకు బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాల గురించి, సమాజం లో ఆడపిల్లల పై జరిగే లైంగిక దాడులు, వేధింపుల నుండి రక్షించ బడటానికి ప్రభుత్వం నుండి అందుతున్న సేవలు , చట్టాల గురించి ముక్యంగా ఈ రోజులలో చిన్నపెద్దా తేడా లేకుండా తెలియకుండా అందరూ మోస గించబడుతూ ఆర్దికంగా నష్ట పోతున్నటువంటి సైబర్ దాడుల గురించి చైతన్యం కల్పిస్తున్నాం అని మన తాడేపల్లి మండలం లోని 11 గ్రామాలలో మా సంస్థ ముక్యంగా పిల్లల కోసం పని చేస్తున్నాం అని ఈరోజు మన ప్రాతూరు గ్రామంలో బాలల రక్షణ కమిటీ ఏర్పాటు చేయటం ఈ మంచి కార్యక్రమానికి మీరందరూ కలిసి రావటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.తర్వాత గ్రామ సచివాలయం సెక్రటరీ జే.అశోక్ కుమార్ మాట్లాడుతూ సమాజ భవిష్యత్తు తరాల నిర్మాణ, రేపటి తరం పౌరులైన బాలల అభివృద్ది కోసం ఇలాంటి ఒక కమిటీ ఏర్పాటు చేయటం చాలా మంచి ఉద్దేశం ఇందులో ప్రభుత్వాన్ని కూడా కలుపుకొని పోవటం అనే ఆలోచన చాలా మంచి విషయం అని మన ప్రాతూరు గ్రామంలోని పిల్లల కోసం గుడ్ షెఫర్డ్ కాన్వెంట్ సిస్టర్స్ తో పాటు మనమందరం కలసి ఈ కమిటీలో సభ్యులుగా ఉండి మన గ్రామాన్ని బాలల హింసా రహిత, బాలల స్నేహ గ్రామంగా తయారు చేద్దాం అని ప్రతిజ్ఞ చేయించటం జరిగినది. తరువాత అత్తోట పోతురాజు సంస్థ సిబ్బంది మాట్లాడుతూ సమాజంలో ఎక్కువగా నిర్లక్ష్యానికి, హింసకు,దోపిడికి గురయ్యేది పిల్లలే అటువంటి పిల్లల ప్రాధమిక హక్కులు పొందుకోలేక పోవటానికి ఉన్న ప్రతీ అడ్డంకి తొలగించాలని సమాజంలో పిల్లల పాత్ర సంక్లిష్టమైనది అయినా సమాజం లో పెద్దల సామూహిక నిర్ణయం ద్వారా ఏ పనిఅయిన జరుగుతుంది అని అయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలు మరియు యువత సమాజంలో చురుకైన భాగస్వాములుగా ఉండాలనే మరియు తమ గొంతును వినిపించాలనే తమ కోరికను ప్రదర్శిస్తూనే ఉండాలనేదే మా సంస్థ యొక్క ముఖ్య లక్ష్యం అని సమాజ భవిష్యత్తుకైనా పిల్లలే అత్యంత కీలకమైన వనరు, వారి శ్రేయస్సు, అభివృద్ధి మరియు విద్య అనేవి సమాజాలు, దేశాల గమనాన్ని నిర్దేశించే ప్రాథమిక ప్రాధాన్యతలు అని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ పెద్దలు అరవపల్లి శ్రీనివాస్ హాజరై చాలా మంచి కార్యక్రమం పిల్లల కోసం మీరు మీ సంస్థ ద్వారా చేస్తున్నది అని మా సహాయ సహకారం ఎప్పుడూ ఉంటుంది అని నూతన గ్రామ బాలల సరక్షణ కమిటిని అభినందించారు ఈ కార్యక్రమంలో సచివాలయం,హెల్త్ డిపార్ట్ మెంట్,గ్రామ పెద్దలు అంగన్వాడీ టీచర్స్ ,గుడ్ షెఫర్డ్ స్వచ్చంధ సంస్థ సిబ్బంది అత్తోట పోతురాజు పెద్దిపాగ అనిల్ కుమార్, సచివాలయం సిబ్బంది స్థానిక ఆషా వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.


