వేసవికాలంలో నగర ప్రజలకు రెండు పూటలు త్రాగునీరు అందిస్తాం
1 min read

నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు,మున్సిపల్ కమిషనర్ ఏ.భాను ప్రతాఫ్
1 కోటి 94 లక్షల రూపాయలతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ బండ్ లీకేజీ పనులు శాశ్వత రిపేర్లు చేసి సిద్ధం
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఈ వేసవికాలంలో నగర ప్రజలకు రెండు పూటలు త్రాగునీరు అందిస్తామని నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు,మున్సిపల్ కమిషనర్ ఏ.భాను ప్రతాఫ్ ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు ఆదేశాలతో మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ 1 కోటి 94 లక్షల రూపాయలతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ బండ్ లీకేజీ పనులు శాశ్వత రిపేర్లు చేసి సిద్ధం చేశామని.ఈ సంవత్సరం వేసవికాలంలో నగర ప్రజలకు రెండు పూటలు త్రాగునీరు అందిస్తామని నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు శ్రీ ఎస్ ఎం ఆర్ పెదబాబు,మున్సిపల్ కమిషనర్ ఏ.భాను ప్రతాప్ తెలిపారు.బుధవారం ఉదయం దెందులూరు సమీపంలోని గోదావరి జలాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ ఎం ఆర్ పెదబాబు,కమిషనర్ భాను ప్రతాప్ మాట్లాడుతూ.2025 ఏప్రిల్ నెలలో గోదావరి జలాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ బండ్ లీకేజీ ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు ఆదేశాలతో యుద్ధ ప్రాతిపాదికన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ బండ్ లీకేజీ తాత్కాలికంగా అదుపులోకి తీసుకువచ్చి గడచిన సంవత్సరం వేసవికాలంలో నగర ప్రజలకు త్రాగునీటిని మన్నించామని పెదబాబు తెలిపారుఈ సంవత్సరం బండ్ లీకేజీ శాశ్వత రిపేర్లు చేయకపోతే ఈ వేసవికాలంలో నగర ప్రజలకు త్రాగునీరు అందించలేమని ముందుగానే గ్రహించి. శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య,మేయర్ నూర్జహాన్ పెదబాబు ఆదేశాలతో బండ్ లీకేజీ శాశ్వతంగా అరికట్టడం బండ్ రక్షణకు కొరియన్ గ్రాస్ పెంచడం వంటి పనులను కౌన్సిల్ ఆమోదం తీసుకొని మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ నుంచి చేయాలని నిర్ణయించామని వారు తెలిపారు. అయితే ఆ పనులను 3 పనులుగా విభజించి. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని త్రాగునీటిని ఏ ఒక్కరూ వృధా చేయకూడదని నగర ప్రజలను కో-ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు నగరపాలక సంస్థ కమిషనర్ ఏ.భాను ప్రతాప్ కోరారు.వీరితోపాటు మున్సిపల్ ఎం.ఇ సురేంద్రబాబు,ఎలక్ట్రికల్ డి.ఈ నారాయణరావు, ఏ.ఈ పవన్ తదితరులు ఉన్నారు.


