NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉల్లి రైతులకు కూటమి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించలేక పోతుంది

1 min read

ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి

ఆలూరు న్యూస్ నేడు : ఆస్పరి మండలం యాటకల్లు గ్రామంలో ఉల్లి పండించిన  రైతు శేఖర్ ను  పరమర్శించిన  ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరుపాక్షి ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మీడియాతో మాట్లాడుతూ…._ఆస్పరి మండలం యాటకల్లు గ్రామంలో రైతు పండించిన ఉల్లికి గిట్టుబాటు ధర లేక శేఖర్ అనే యువ రైతు పండించిన ఉల్లిని వంక లో పారేయడం జరిగింది రైతులు పడుతున్న కష్టాలను కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా రైతు లను పట్టించుకోవడం లేదు … కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత  రైతులు పండించిన ఉల్లి, పత్తి, మిరప ఎ పంటకు కూడా  గిట్టుబాటు ధర  లేదు  కూటమి ప్రభుత్వం ఉల్లి కి 1200 రూపాయలు గిట్టుబాటు ధర చెప్పిన ఏ రైతుల దగ్గర కూడా ఉల్లిని 1200 రూపాయలకు తీసుకోలేదన్నారు .. కూటమి ప్రభుత్వం ఉల్లికి  ఒక హేక్టర్ కు 50000 వేల రూపాయలు ప్రకటించిన రైతులకు ఏమాత్రం సరిపోదు అన్నారు … రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోతే  నేను రైతుల తరపున పోరాడుతూనే ఉంటానని  ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి  అన్నారు  రైతు శేఖర్  మాట్లాడుతూ.. రెండు ఎకరాలలో ఉల్లి పంట సాగు చేసి 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినా తమకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు … ఉల్లికి మద్దత్తు ధరలేక ఏమి చెయ్యాలో అర్దం కాక నీటిలో పారబోసానని అన్నాడు  ప్రభుత్వం ఆదుకుంటామని చెప్పి ఏమి పట్టించుకోవడం లేదూన్నారు ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు,తాలూకా కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు,వైస్ ఎంపీపీ లు ఎంపీటీసీ లు, కో కన్వీనర్, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివీఆర్​ అభిమానులు పాల్గొన్నారు.

About Author