NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం

1 min read

రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ

రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం

జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

కర్నూలు, న్యూస్​ నేడు : భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం కల్పించడం జరుగుతోందని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో  రైతులకు పాత భూ హక్కు పత్రాల స్థానంలో రాజముద్రతో కూడిన  కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు.శనివారం కల్లూరు మండలం పందిపాడు గ్రామ సచివాలయంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమం లో భాగంగా రైతులకు  కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను కలెక్టర్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా  కలెక్టర్ రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల ప్రయోజనాల గురించి వివరిస్తూ కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలలో క్యూఆర్ కోడ్ కూడా ఉంటుందని, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే సంబంధిత పొలం వివరాలు అని వస్తాయన్నారు.  పొలానికి సంబంధించిన అక్షాంశం , రేఖాంశం ఇతరులు ఎవరు మార్చలేరన్నారు. ఈ పట్టాదారు పాస్ పుస్తకాన్ని ఇతరులు ఎవరు డూప్లికేట్ చేయలేరన్నారు. అంగన్‌వాడీ కేంద్రం పరిసరాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా  చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అంగన్వాడి సిబ్బందిని ఆదేశించారు..పిల్లలకు మెనూ ప్రకారం నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందించాలని  కలెక్టర్ అంగన్వాడి సిబ్బందిని ఆదేశించారు.. పిల్లలతో కలిసి కూర్చుని   ఉదయం తినడానికి ఏమి పెట్టారని  అడిగి తెలుసుకున్నారు. ప్రీ స్కూల్ విద్యకు సంబంధించి పిల్లలు ఏమి నేర్చుకున్నారు అని పరిశీలించారు వంట గదిని పరిశీలించారు.  స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు.  కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, కల్లూరు తహసిల్దార్ ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *