జిజిహెచ్ లో అరుదైన శస్త్ర చికిత్సలు
1 min read

కర్నూలు , న్యూస్ నేడు: కర్నూలు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి (జిజిహెచ్) లో , శస్త్రచికిత్స రెండవ విభాగం లో ఇటీవల రెండు అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. బేతంచర్లకు చెందిన సుమలత (25), గత 4 సంవత్సరాలుగా తరచూ రక్త వాంతులు, అధిక మాసిక రక్తస్రావం, ప్యాన్సైటోపెనియా కారణంగా పునరావృత రక్త మార్పిడి తీసుకుంటూ వచ్చారు. గతంలో ఈవిఎల్ బ్యాండింగ్ చేయించుకున్న ఈమెకు 15-07-2025 న ఆసుపత్రిలో చేర్పించారు. 24-07-2025 న స్ప్లీనెక్టమీ అనంతరం స్ప్లీనోరెనల్ షంట్ శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ తరువాత ఎలాంటి సమస్యలు రాకుండా 09-08-2025 న డిశ్చార్జ్ చేశారు.అదేవిధంగా గోనెగండ్ల కు చెందిన రంగస్వామి (53), మద్యపానం అలవాటు కలవారు. తరచూ కడుపునొప్పితో బాధపడుతూ, క్రానిక్ కేల్సిఫిక్ పాంక్రియాటైటిస్‌గా నిర్ధారణ అయింది. ఈయనను 26-06-2025 న ఆసుపత్రిలో చేర్పించారు. 29-06-2025 న లాటరల్ ప్యాంక్రియాటికో-జెజునోస్టమీ చేశారు. శస్త్రచికిత్సలో పాంక్రియాస్‌లో సుమారు 10 రాళ్లు, అతిపెద్దది 3×2 సెంటీమీటర్ల పరిమాణంలో ఉండటం వంటి అరుదైన అంశం గుర్తించారు. 05-07-2025 న శస్త్రచికిత్స అనంతర సమస్యలు లేకుండా డిశ్చార్జ్ అయ్యారు.ఈ శస్త్రచికిత్సలను ప్రొఫెసర్ డాక్టర్ రామకృష్ణ నాయిక్ నిర్వహించారు. వీరికి తోడుగా ప్రొఫెసర్ డాక్టర్ జయరాం , అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సబీరా , అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రణీత్, డాక్టర్ ప్రశాంతి మరియు పీజీలు కూడా శస్త్రచికిత్స బృందంలో భాగమయ్యారు. అనస్థీషియా బృందంలో ప్రొఫెసర్ మరియు హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ డాక్టర్ విశాల , ప్రొఫెసర్ డాక్టర్ సుధీర్ , అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అరుణలత , అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సంజీవ్ కుమార్ ఉన్నారు.

