NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముందస్తు సంక్రాంతి సంబరాలు- ముగ్గుల పోటీలు

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థినిలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు.ఈ సందర్బంగా శుక్రవారం ప్రిన్సిపాల్ సుబ్రమణ్యం  విజేతలకు బహుమతులను అందజేసెను అనంతరం మాట్లాడుతూసంక్రాంతి పండుగ మన సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీకం. ముగ్గులు మన ఇంటి ముంగిట అందాన్ని, శోభను పెంచుతాయి. ఈ పోటీలలో పాల్గొన్న విద్యార్థులు తమ కళానైపుణ్యాన్ని ఉపయోగించి సృజనాత్మకతతో చాలా చక్కగా ముగ్గులు వేశారు అని అన్నాడు.ముగ్గులు వేయడం ఒక కళ. ఈ కళను నేర్చుకోవడం, ప్రదర్శించడం విద్యార్థులకు ఒక మంచి అనుభవం అని తెలిపారు .అందరికి ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రథమ బహుమతి:- సృజన, రూపద్వితీయ బహుమతి:- లహరి, శ్రావణి,  తృతీయ బహుమతి :- అమృత, చందన, పల్లవి.ఈ కార్యక్రమం లో  ఎన్ఎస్ఎస్ పిఓ  నవీన పాటి,  అధ్యాపకులురామకృష్ణయ్య ,క్రిష్ణ, (సీనియర్ అసిస్టెంట్)ముస్తాక్ ,మురళి మోహన్ గౌడ్ ,వెంకటరమణ, మద్దిలేటి ,వెంకటేశ్వర్లు ,శంకరయ్య, సురేష్,మంజునాథ్ మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.

About Author