విద్యుత్ భవన్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
1 min read

జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పాల్గొన్న ఉద్యోగ సిబ్బంది
పండుగ వాతావరణన్ని తలపించేలా కార్యక్రమం
ప్రభుత్వ పథకాల అమలు తీరులో ఏలూరు జిల్లా ముందు వరుసలో ఉండడం మీ సహకారం అభినందనీయం
ఎస్.ఈ. పి.సాల్మన్ రాజు
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏపీ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ రామచంద్రరావు పేట సూపరిoటెండింగ్ ఇంజనీర్ కార్యాలయ ప్రాంగణం(విద్యుత్ భవన్) లో జనవరి 26,2026 సంవత్సర గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్: బి.ఆర్ అంబేద్కర్ చిత్ర పటాల కి నివాళులర్పించి జాతీయగీతానాలపించి జాతీయ పతాకన్ని ఎగురవేశారు. విద్యుత్ ఉద్యోగుల ఫ్రెండ్లీ స్పోర్ట్స్ లో విజేతలైన రన్నర్స్ కి. విన్నర్స్ మెమొంటోస్, ప్రశంస పత్రాలు అందజేశారు. జిల్లాలో వివిధ ప్రాంతాల విద్యుత్ ఉద్యోగులు శాఖపoగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి నగదు బహుమతి,ప్రశంసా పత్రలు ఎస్.ఇ పీ.సాల్మన్ రాజు చేతుల మీదగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కె.శ్రీనివాసరావు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టెక్నికల్,డి.ఆదినారాయణ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి పి ఈ, పీర్ అహ్మద్ ఖాన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్ జంగారెడ్డిగూడెం, ఏడీఈలు ఏఈలు మరియు ఇతర విద్యుత్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏపీ ఈపీడీసీఎల్ ప్రభుత్వ పథకాల అమలుతీరులో మన ఏలూరు జిల్లా ముందంజలో ఉండటం మీ సహకారానికి అభినందనీయమని ఎస్ ఈ, పలువురు ఉద్యోగులు కొనియాడారు.


