శిశు మందిరం లో 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు
1 min read

ప్యాపిలి, న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిరం లో 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా ప్యాపిలి పుర వీధుల గుండా శోభా యాత్ర నిర్వహించారు.జాతీయ నాయకుల వేశాధారణాలతో ఘోష్ తో శోభా యాత్ర సాగింది. ప్యాపిలి ఎస్ఐ నాగార్జున జాతీయ నాయకులకు పూజ చేసి, జెండా పతాకం ఆవిష్కరించారు.తరువాత జనగణమనగీత ఆలాపన,వందేమాతరం గేయం విన్నవించారు. చిన్న పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ప్రసంగాలు చేశారు. ప్యాపిలి ఎఎస్ఐ వెంకటేశ్వర్లు మరియు పోలీస్ సిబ్బంది మొదలగువారు ఈ కార్యక్రమం కు విచ్చేసారు.ముఖ్య అతిధిగా పాఠశాల కార్యదర్శి బి.సి. విజయ్ కుమార్ , పాఠశాల అధ్యక్షులు వై. పార్థసారథి , పాఠశాల ఉపాధ్యక్షులు దేవిదయానంద్ సింగ్ ప్రసంగించిరి. 2025వ సంవత్సరంలో 10వ తరగతి ఫలితాల్లో 1st మరియు 2nd స్థానంలో ఉత్తిర్ణత సాధించిన విద్యార్థుల తల్లితండ్రులను సన్మానించారు. పిల్లలు షీల్డ్ లు బహుకరించారు.ఈ కార్యక్రమంలో ఆచార్యులు, పిల్లలు, పోషకులు పాల్గొన్నారు.

