పాస్టర్లు కట్టిన బెనిఫిషియరీ అమౌంట్ తిరిగి ఇవ్వాలని వినతి
1 min read
జీసస్ బిలీవర్స్ అసోసియేషన్ కౌన్సిల్, చైర్మన్, ప్రొఫెసర్ జోసెఫ్ మోసిగంటి,
గుంటూరు, న్యూస్ నేడు : చేబ్రోలులో ఒక ప్రకటన చేస్తూ, 2018 సంవత్సరంలో G.O. Rt.No.130, 01-06-2018 ప్రకారం, తూర్పుగోదావరి జిల్లాలో చర్చిల మరమ్మత్తు నిమిత్తం ఒక చర్చికి మూడు లక్షలు చొప్పున 30 చర్చిలకు 90 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు, బెనిఫిషియరీ కంట్రిబ్యూషన్ కింద శాంక్షన్ అమౌంట్ లో పది శాతం కట్టమంటే ప్రతి చర్చి పాస్టర్ 30,000 రూపాయలు చెల్లించారు, మొత్తం 30 చర్చిలు వారు కలిపి 9 లక్షల రూపాయలు చెల్లించారు, మిగతా జిల్లాల్లో కూడా ఈ విధముగా చెల్లించారు. చర్చిల మరమ్మత్తులకు డీడీలు ఇచ్చే సమయంలో, వైసీపీ పార్టీ నాయకులు, ఎలక్షన్ దృష్ట్యా అభ్యంతరం చెప్పడంతో, డిడి లు ఇచ్చే ప్రక్రియ ఆగిపోయింది, తరువాత వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత, మంత్రులు దృష్టికి, నాయకుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ శాంక్షన్ చేయలేదు, పాస్టర్లు 30,000 రూపాయలు అప్పు చేసి కట్టాము, మేము కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వండి అని మొరపెట్టిన, వైసీపీ క్రైస్తవ నాయకులు కానీ,మాజీ క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ గాని, శాంక్షన్ చేయించలేదుకదా, పాస్టర్లు కట్టిన డబ్బులు తిరిగి ఇప్పించలేదు. జగన్మోహన్ రెడ్డి సమాజానికి పనిచేయని నాయకులకు, నామినేటెడ్ పదవులు ఇచ్చి, ప్రజలను ఇబ్బందులు పాలు చేశారు, జగన్మోహన్ రెడ్డి ఇంత అన్యాయం చేసినప్పటికిని క్రైస్తవ సమాజం మావోడు అనుకోవడంలో అర్థం లేదు, జగన్ ప్రభుత్వంతో పోలిస్తే చంద్రబాబు పాలనలోనే క్రైస్తవ సమాజానికి మేలు జరిగింది. పాస్టర్లు అప్పులు చేసి కట్టారని, ఆరు సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నారని, పాస్టర్లు కట్టిన డబ్బులు తిరిగి ఇప్పించాలని, నాయకులను అధికారులకును ప్రొఫెసర్ జోసెఫ్ సూచించారు. క్రైస్తవులకు ఏ సమస్య ఉన్న తన ఫోన్ నెంబర్ 7075482182 కి మెసేజ్ గాని కాల్ గాని చేసి తెలియజేస్తే, నాయకులు, అధికారుల దృష్టికి తీసుకువెళతానని, సమాజానికి అందుబాటులోఉంటానని తెలిపారు.

