NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యా పరిరక్షణ కోసం ఉద్యమాలకు సిద్ధం కావాలి

1 min read

ఏఐఎస్ఎఫ్ జిల్లా  అధ్యక్షులు డిసోమన్న 

పత్తికొండ, న్యూస్​ నేడు: విద్యా పరిరక్షణ కోసం విద్యార్థులంతా ఉద్యమాలకు సిద్ధం కావాలని ఏఐఎస్ఎఫ్ డి సోమన్న పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక జూనియర్ కళాశాల ఆవరణలో ఏఐఎస్ఎఫ్ పట్టణ సమితి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థి సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున ఏఐఎస్ఎఫ్ బలోపేతానికి అందరూ కృషి చేయాలని కోరారు. అన్ని విధాలుగా వెనుకబడిన పత్తికొండ ప్రాంతంలో విద్యార్థుల సమస్యల పట్ల ముందుండి ఉద్యమాలు నిర్వహిస్తుందని తెలిపారు. పత్తికొండలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పీఈటీల పోస్టులని తక్షణమే భర్తీ చేయాలని ఆయన కోరారు. అలాగే పత్తికొండ పట్టణంలో ఉన్న ఇంటర్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు వసతి గృహాలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే పత్తికొండ పట్టణంలో బీసీ బాలికల వసతిగృహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో యాజమాన్యం విద్యార్థుల నుండి వసూలు చేస్తున్న అధిక ఫీజులను అరికట్టాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి శివ, పట్టణ కార్యదర్శి వినోద్, సహాయ కార్యదర్శులు మాబాష,దర్శి,నాయకులు చరణ్ పాల్గొని విద్యార్థి సమస్యల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పత్తికొండ జూనియర్ కళాశాల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. నూతన కమిటీ  అధ్యక్షులుగా బాబు,ఉపాధ్యక్షులుగా మనోహర్,వీరేంద్,రాజు,కార్యదర్శిగా రంగస్వామి, సహాయ కార్యదర్శులుగా ధనంజయ ,హరీష్ ,రాజు, కోశాధికారిగా p- గణేష్, అఖిల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

About Author