మాదక ద్రవ్యాల వినియోగంపై కలిగే అనర్ధాలపై కార్యక్రమం
1 min read

వైద్య విద్యార్థిని,విద్యార్థులకు ఆశ్రమ వైద్య కళాశాలలో అవగాహన సదస్సు
పాల్గొన్న ఏలూరు రేంజ్ ఐజి జి.వి.జి అశోక్ కుమార్,ఈగిల్ టీం ఐజి రవి కృష్ణ,ఏలూరు జిల్లా ఎస్పీ
కె.ప్రతాప్ శివ కిషోర్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఆశ్రమ వైద్య కళాశాలలో మాదక ద్రవ్యాల వినియోగంపై కలిగే అనర్థాలను వైద్య కళాశాల విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన సదస్సును బుధవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఆశ్రమ హాస్పిటల్ ప్రిన్సిపల్ డాక్టర్:శ్రీనివాస్ చేబ్రోలు, ఆశ్రమ హాస్పిటల్ సీఈవో హనుమంతరావు, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీలత, అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ ప్రభు కుమార్, మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వలన జరిగే అనర్ధాలను గురించి మాదక ద్రవ్యాలు ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువగా వినియోగించేది చదువుకున్నవారు కావడం చాలా బాధాకరమైనటువంటి విషయమని చదువుకునే ఆశ్రమ హాస్పిటల్లో ఈగల్ ఎస్పీ నగేష్ బాబు ఐపీఎస్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగము లో ఉన్నత విద్యను అభ్యసించే వారి ఎక్కువగా మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారని,ఎక్కువగా స్ట్రెస్ కు ఫీలైనటు వంటి వారు ఆ యొక్క స్ట్రెస్ నుంచి తప్పించుకోవడం కొరకు మత్తు పదార్థాలు వినియోగానికి అలవాటు పడుతున్నారని దాని వలన వారి యొక్క బంగారు భవిష్యత్తు అంధకారం అవుతుందని, విద్యార్థిని విద్యార్థులు మీ చుట్టు పక్కల ఎవరైనా గంజాయి అమ్మకాలు జరిపిన లేదా వినియోగించిన అటు వంటి వారి యొక్క సమాచారాన్ని 1972 కు సమాచారం అందించాలని ప్రతి ఒక్కరూ కూడా మాదక ద్రవ్యాల రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కొరకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని తెలియ చేసినారు.ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ మాట్లాడుతూ వైద్యులు ప్రాణాలను రక్షించడం కొరకు ఉపయోగించేది ఔషధము అని, కానీ డ్రగ్స్ అనేవి రెండు రకాలు ఉన్నాయని ఒకటి ప్రాణాలు నిలబెట్టేదైతే మరొకటి ప్రాణాలను పోగొట్టేది అని సమాజంలో మాదక ద్రవ్యాల వాడకం వలన సమాజానికి చేటు కలుగుతుందని ఎక్కువగా విద్యార్థిని విద్యార్థులు సోషల్ మీడియాలో పరిచయమయ్యేటటువంటి వారి వలన ఇటువంటి దుర అలవాట్లను కలిగి ఉంటున్నారని కానీ మీరు భవిష్యత్తులో వైద్య వృత్తిలో నైపుణ్యాన్ని సంపాదించుకుంటూ ఎదుటివారి యొక్క ప్రాణాలను కాపాడడానికి కావలసినటు వంటి సహాయ సహకారాలు అందించే స్థాయిలో ఉంటారని ఒక మంచి డాక్టర్ ఒక మంచి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడానికి దోహదపడతారని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తెలియ చేసినారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ హాస్పిటల్ ఎండి రతీదేవి, ఈగల్ స్పెషల్ ఎస్పీ నగేష్ బాబు ఐపీఎస్, ఆశ్రమ హాస్పిటల్ ప్రిన్సిపల్ డాక్టర్ చేబ్రోలు శ్రీనివాసరావు,ఆశ్రమ హాస్పిటల్ సీఈవో డాక్టర్ హనుమంతరావు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ ఎక్సైజ్ ప్రభు కుమార్, ఏలూరు డిఎస్పీ డి శ్రావణ్ కుమార్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ధనరాజు, ఏలూరు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మల్లేశ్వర రావు, ఏలూరు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఏలూరు రూరల్ ఎస్సై దుర్గాప్రసాద్ మరియు ఎక్సైజ్ సిబ్బంది పోలీస్ సిబ్బంది వైద్య విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.


