ప్రాథమిక పాఠశాల నిర్మాణం కోసం 23.95 లక్షల రూ. నిధులు మంజూరు
1 min read

పెనమలూరు, న్యూస్ నేడు: నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని పోరంకి బిజేపి నగర్లో ప్రాథమిక పాఠశాల నిర్మాణం కోసం 23.95 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి, శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ జిల్లా తెదేపా అధ్యక్షుడుశ్రీ వీరంకి వెంకట గురుమూర్తి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యావ్యవస్థను పటిష్ట పరిచేలా భవిష్యత్తు నాయకులు, విద్యాశాఖామంత్రి శ్రీ నారా లోకేష్ క్షేత్రస్థాయిలో మార్పులు తీసుకువస్తూ, బలహీనవర్గాల విద్యార్థులకు మెరుగైనవిద్యను అందించడంతో పాటు, యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించే భాగంలో పాఠశాల భవనాలు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్న ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలో పెనమలూరు నియోజకవర్గం ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో ప్రజలందరికీ సంక్షేమం అభివృద్ధి అందించే అవకాశం వచ్చిందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో తాడిగడప మునిసిపాలిటీ అధ్యక్షులు అనుమోలు ప్రభాకర్ రావు రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్ రాష్ట్ర అగ్రిపుల క్షత్రియ డైరెక్టర్ పీత గోపీచంద్ రజక కార్పొరేషన్ డైరెక్టర్ తాతపూడి గణేష్ బీసీ సెల్ అధ్యక్షులు సంగేపు రంగారావు సిరిగిరి మధు కూటమి నాయకులు, కార్యకర్తలు,అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

