వక్ఫ్ బోర్డుకు కేటాయించిన జీఓను రద్దు చేయాలి
1 min read

లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు-పాత్రికేయుల సమావేశంలో మైనార్టీ నాయకులు..
నందికొట్కూరు, న్యూస్ నేడు: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చిన్న కాకిని గ్రామంలో 71 ఎకరాల వక్ఫ్ బోర్డ్ భూమిని ఇండస్ట్రియల్ పార్కుకు కేటాయిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని నందికొట్కూరు వైయస్సార్సీపి మైనార్టీ నాయకులు పాత్రికేయుల సమావేశంలో మండిపడ్డారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో డాక్టర్ సుధీర్ స్వగృహంలో మంగళవారం ఉదయం రాష్ట్ర వైయస్సార్సీపి మైనార్టీ కార్యదర్శి అబ్దుల్ జబ్బార్, వైయస్సార్ టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూమిన్ మన్సూర్,పట్టణ అధ్యక్షులు మన్సూర్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ కోట్ల రూపాయలు పలికే భూమిని చంద్రబాబు ఇండస్ట్రీ పేరుతో దారాదత్తం చేయడం తగదు ఈ జీవోను వెంటనే రద్దు చేయాలి జీవోను రద్దు చేయకపోతే ముస్లిం మైనారిటీలమంతా కలిసి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతాం వర్క్ బోర్డ్ స్థలాన్ని ఇండస్ట్రియల్ పార్క్ కు కేటాయిస్తూ జీవో ఇవ్వడంపై ముస్లీం మైనార్టీలు మండి పడుతున్నారని ముస్లిం మైనారిటీలకు అండగా ఉన్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లను కల్పించిన వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఆయన అడుగుజాడల్లో మాపార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా మైనార్టీలకు అండగా ఉంటూ వస్తున్నారని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో మిడుతూరు వైస్ ఎంపీపీ నభి రసూల్,కౌన్సిలర్లు నాయబ్,రవూపఫ్,మహబూబ్ భాష,లడ్డు,ఉస్మాన్,రహంతుల్లా, ముస్లిం మైనారిటి నాయకులు పాల్గొన్నారు.


